ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మే12న ప్రేక్షకుల మందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. ఇక ఈ మూవీ అనంతరం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: తొలి ఇండియన్ సినిమాగా ప్రభాస్ మూవీ!
ఇందులో మహేష్ బాబుకు జోడిగా పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ మహేష్ బాబుకి తండ్రి పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్రివిక్రమ్ కూడా ఆయనను సంప్రదించినట్లు సమాచారం.
మరి నిజంగానే ప్రిన్స్ కు తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించనున్నాడా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే. ప్రిన్స్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నాడనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.