ఈ మధ్యకాలంలో చిత్రపరిశ్రమల్లో తరచు విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్ లోనే కాకుండా ఇతర పరిశ్రమలో సైతం విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్య సమస్యలు, గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి కారణాలతో ఇటీవల కాలంలో పలువురు సినీ ప్రముఖులు అకాలమరణం చెందారు. వారి మరణంతో కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు మృతిచెందారు
ఈ మధ్యకాలంలో చిత్రపరిశ్రమల్లో తరచు విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్ లోనే కాకుండా ఇతర పరిశ్రమలో సైతం విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్య సమస్యలు, గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి కారణాలతో ఇటీవల కాలంలో పలువురు సినీ ప్రముఖులు అకాలమరణం చెందారు. వారి మరణంతో కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. ఇటీవలే టాలీవుడ్ హీరో నందరమూరి తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన కొందరు అనారోగ్యంతో మరణించారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ మృతిచెందారు.
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ప్రదీప్ సర్కార్(67) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారు జామున్న 3.30 గంటల సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు, నటి నీతు చంద్రశ్రీవాత్సవ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హెలికాఫ్టర్ ఈలా, పరిణీతి, మార్దానీ మొదలైన పాపులర్ చిత్రాలు తీసి గుర్తింపు పొందారు. పలు మ్యూజిక్ ఆల్భమ్ కూడా డైరెక్ట్ చేశారు. గత కొంతకాలం నుంచి ఆయన మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన తరచూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇటీవలే ఆయనకు పొటాషియం స్థాయులు క్రమంగా పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున్న 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
ప్రదీప్ మృతి విషయాన్ని ఆయన బంధువు, బాలీవుడ్ నటి నీతూ చంద్ర ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమకు ఎంతో ఆత్మీయమైన దర్శకు ప్రదీప్ సర్కారు మృతి తనను ఎంతో బాధించిందిని పేర్కొన్నారు. తన సినీ కెరీయర్ ఆయన సినిమాతోనే మొదలైందని గుర్తు చేసుకున్నారు. ప్రదీప్ సర్కార్ మృతి విషయాన్ని ఆయన సోదరి మాధురి కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రదీప్ మృతిని బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలానే ప్రదీప్ మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. మరి.. ప్రదీప్ మృతిపై మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.