ఇండస్ట్రీలో వెలిగిపోదామని భావించే వారు ఎదుర్కొనే అతి ప్రధానమైన సమస్య.. క్యాస్టింగ్ కౌచ్. అవకాశాలు కావాలంటే మేం చెప్పినట్లు చేయి అంటూ బెదిరిస్తారు. చాలా మంది ఇలాంటి బెదిరింపులకు భయపడి.. బాబోయ్ ఈ ఫీల్డు వద్దనుకుని బయటకు వచ్చేస్తారు. కొందరు కాంప్రమైజ్ అవుతారు.. మరి కొందరు ఇలాంటి వారి బెదిరింపులకు లొగకుండా.. తమ ప్రతిభను నమ్ముకుని.. అవకాశాల కోసం శ్రమిస్తారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడే ఉంటారు. తాజాగా బుల్లితెర నటి శివ్య పఠానియా సైతం తాను క్యాస్టింగ్ కౌచ్‌ను ఫేస్ చేశానంటోంది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా శివ్య పఠానియా మాట్లాడుతూ.. ‘‘‘హమ్ సఫర్ షో’ ముగిశాక నెక్స్ట్ ఏంటన్నది తోచలేదు. ఎనిమిది నెలల పాటు దిక్కు తోచక ఉండిపోయాను. అలాంటి సమయంలో నన్ను ఆడిషన్‌కు రమ్మంటూ ఫోన్‌కాల్ వచ్చింది. ముంబైలోని శాంతాక్రజ్‌లో ఆడిషన్.. అది చిన్న గది, లోనికి వెళ్లాను. అక్కడున్న వ్యక్తి.. నువ్వు నాతో ఒకరోజుకి కాంప్రమైజ్ అయ్యావంటే పెద్ద స్టార్‌తో యాడ్‌లో నటించేందుకు ఛాన్స్ ఇస్తానన్నాడు. విచిత్రం ఏంటంటే అతడు ల్యాప్‌టాప్‌లో హనుమాన్ చాలీసా వింటున్నాడు’’ అని నాటి సంఘటనను గుర్తు చేసుకుంది.
ఇది కూడా చదవండి: మాధవన్ ను అలా చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన హీరో సూర్య..! వీడియో వైరల్
‘‘వెంటనే నేను అతడు అడిగిన ప్రశ్నకు గట్టిగా నవ్వేశాను. కొంచెమైనా సిగ్గుందా.. భజన పాట వింటూ ఏం అడుగుతున్నావసలు అని తిట్టేశాను. ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్‌కు చెప్పి వాళ్లను జాగ్రత్తపడమన్నాను. కానీ తర్వాత తేలిందేంటంటే అతడసలు నిర్మాతే కాదు, అతడే కాదు అతడి బ్యానర్ కూడా ఫేకే అని తెలిసింది. మరి అతడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు’’ అంటూ చెప్పుకొచ్చింది శివ్య. ఇక సినిమాలు, షోల విషయానికి వస్తే.. ఆమె చివరగా హాట్‌స్టార్ స్పెషల్స్.. ‘షూర్‌వీర్’ వెబ్‌సిరీస్‌లో నటించింది. శివ్య పఠానియా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Samrat Reddy: తండ్రి కాబోతున్న బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్.. భార్యతో పిక్స్ వైరల్!