నోరా ఫతేహి..నటనలో రాణిస్తూనే బాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్స్ గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్లో పలు సంగీత ఆల్బమ్స్‌లో చిందులేసింది నోరా ఫతేహి. ఆకర్షణీయమైన అందం ఆమె సొంతం. తన అందంతో కుర్రాళ్ల మతిగొటేస్తోంది ఈ అమ్మడు. బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు ఐటెమ్ సాంగ్స్ తో మెరిసింది. అయితే తాను మంచి డ్యాన్స్రర్స్ గా ఈ స్థాయి కి రావడానికి ఎన్నో కష్టాలు పడింది. చివరికి డ్యాన్సర్ కావడం కోసంచెప్పు దెబ్బలు కూడా భరించింది ఈ హాట్ బ్యూటీ. ఈ మాటలు తానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
మొరాకో దేశంకి చెందిన నోరా ఫతేహి కి చిన్నతనం నుంచి డ్యాన్స అంటే బాగా ఇష్టం. మంచి డ్యాన్సర్స్ కావాలని కలలు కంటూ ఉండేది. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం దానికి ఒప్పుకునేవారు కాదట. బుద్ధిగా చదువుకోమని ఆమెకు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తు ఉండేది. అయినా కూడా నోరా ఫతేహి మాత్రం డ్యాన్స్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండేదట. అలా తన తల్లికి తెలియకుండా డ్యాన్స్ చేస్తూ ఉండేది. అలా డ్యాన్స్ చేస్తూ ఒకసారి తన తల్లికి పట్టు పడి చెప్పు దెబ్బలు కూడ తిన్నానని తెలిపింది. అయినా కూడా డ్యాన్స్ నేర్చుకోవడం మాత్రం వదల్లేదని ఈ అమ్మడు తెలిపింది. ఈ అమ్మడు తెలుగులో టెంపర్, బాహుబలి,,కిక్ 2 వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి.. మంచి పేరు సంపాందించింది. బాలీవుడ్ లో కూడా అనేక సినిమాల్లో నటిస్తూ, నర్తిస్తూ ఆమె ఇంకా మంచి పేరు సంపాదించే ప్రయత్నం చేస్తోంది.
ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త కుటుంబాన్ని బెదిరించి 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన కేసులో తమిళనాడుకు చెందిన సుకేష్ చంద్రశేఖర్ వ్యక్తి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ కేటుగాడు మారుపేరుతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి ఇద్దరినీ కూడా ప్రేమ పేరుతో ట్రాప్ లో పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిజంగానే అతను ప్రేమిస్తున్నాడని భావించిన ఇద్దరూ అతను ఇచ్చిన గిఫ్ట్ లను కూడా తీసుకున్నారని టాక్ వినిపించింది. ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తానికి డ్యాన్స్ కోసం ఇంట్లో చెప్పు దెబ్బలను కూడా భరించింది ఈ బాహుబలి భామ. మరి.. నోరా ఫతేహి చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.