భారతీయ చలన చిత్ర రంగంలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్నారు నటి శ్రీదేవి. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో నటించిన ఆమె తర్వాత బాలీవుడ్ లో స్థిరపడిపోయారు. ఆమె మరణానంతరం కుమార్తె జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ అమ్మడు తక్కువ చిత్రాల్లో నటించినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే సంపాదించుకుంది. జాన్వీ కపూర్ సినిమాల విషయంలో ఏమో కానీ ఫోటోషూట్స్ దగ్గర మాత్రం తగ్గేదే లే అంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అలానే తన తల్లి బాటలోనే తరచూ తిరుమల కు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటుంది. ఇప్పటికే అనేక సార్లు ఈ జాన్వీ శ్రీవారిని దర్శించుకుంది. తాజాగా గురువారం మరోసారి తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అతిలోక సుందరి శ్రీ దేవి నట వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించింది. బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది. తన అందాలతో కుర్రాళ్ల గుండెల్లో నిద్రపోతుంది. శ్రీదేవిని జాన్వీ కపూర్‌లో చూసుకునే ఫ్యాన్స్ ఉండనే ఉన్నారు. టాలీవుడ్ అభిమానులు, మరీ ముఖ్యంగా శ్రీదేవి అభిమానులు జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే అందుకు సంబంధించి ఇప్పటివరకు చాలానే వార్తలు వచ్చాయి. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. విజయ దేవరకొండ, ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాలతో తెలుగులోకి జాన్వీ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ చాలానే వార్తలు వినిపించాయి. అవి వాస్తవం కాదని తేలిపోయింది.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జతగా జాన్వీ కపూర్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మెగా హీరోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు జాన్వీ కపూర్ కూడా రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో కూడా ఎంత వరకు నిజం ఉందనేది చెప్పే పరిస్థితి లేదు. జాన్వీ కపూర్ ఎంట్రీపై మాత్రం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇటీవలే రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. RC-16 ప్రాజెక్ట్ ను ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ సినిమా ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నా ఏటా తిరుమల దర్శనానికి మాత్రం తప్పకుండా వస్తుంటుంది. ఇన్స్టాగ్రామ్ లో డైలీ హాట్ ఫోటోలతో ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తుంటుంది. సినిమాల్లో క్రేజ్ ఎలా ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె అందాల ఆరబోతకు విపరీతమైన క్రేజ్ ఉంది. బోల్డ్ ఫోటోలు, ఎక్సర్సైజ్ వీడియోలు, మైండ్ పోగొట్టే బోల్డ్ యోగా ఫోటోలు పెడుతూ కుర్రాళ్ళకి మత్తెక్కిస్తూ ఉంటుంది.
ఇలా ఉన్న తిరుపతికి వెళ్తే మాత్రం చాలా పద్దతిగా ఉంటుంది. లంగాఓణీ వేసుకుని పదహారణాల తెలుగమ్మాయిలా స్వామివారి దర్శనానికి వస్తుంటుంది. బోల్డ్ ఫోటోలు చూసిన జాన్వీకి తిరుపతిలో కనిపించే జాన్వీ పూర్తి విరుద్దంగా ఉంటుంది. తాజాగా గురువారం లంగాఓణీలో తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంది. మొదట అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ తిరుమలకు చేరుకుంది. జాన్వీ సంప్రదాయంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంది. దేవస్థానం వద్ద మోకాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసింది. తన మొక్కులను తీర్చుకుంది. ఆ తర్వాత తిరుమల మాడ వీధుల్లో తన స్నేహితులతో కలిసి సందడి చేసింది. జాన్వీ తిరుమలలో సందడి చేసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నటనలో విషయంలో తల్లి శ్రీదేవికి పోటీరాని జాన్వీ..సంప్రదాయల విషయంలో మాత్రం తల్లికి తగ్గ తనయురాలని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.