ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ పేరే చెప్పేవారు. సౌత్ సినిమాలని బాలీవుడ్ కి పరిచయం చేయాలంటే ఏ దర్శకుడు కూడా ధైర్యం చేసేవాడు కాదు. కానీ బాహుబలి తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అయితే అనూహ్యంగా గత కొంత కాలంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మూగబోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు "నసీరుద్దీన్ షా" సౌత్ సినిమాల మీద పగ పట్టినట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ పేరే చెప్పేవారు. సౌత్ సినిమాలని బాలీవుడ్ కి పరిచయం చేయాలంటే ఏ దర్శకుడు కూడా ధైర్యం చేసేవాడు కాదు. కానీ బాహుబలి తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యం కేవలం ఇండియా లోనే కాక.. ప్రపంచమంతటా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బాహుబలి వేసిన ఈ మార్గంలో చాలాసౌత్ సినిమాలు పాన్ ఇండియా గా మూవీలుగా తెరకెక్కి.. బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ లిస్టులో సాహో, ట్రిపులార్, కెజిఎఫ్ సిరీస్, పుష్ప, కాంతారా.. లాంటి సినిమాలు ఉన్నాయి.
అనూహ్యంగా గత కొంత కాలంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మూగబోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఏ బాలీవుడ్ సినిమా కూడా అంచనాలను అందుకోలేక విఫలమైంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు “నసీరుద్దీన్ షా” సౌత్ సినిమాల మీద పగ పట్టినట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమాలదే హవా. ఈ దశలో బాలీవుడ్ ప్రేక్షకులు సైతం తమ సినిమాలకన్నా సౌత్ సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినిమాలు ఆడట్లేదనే బాధో.. లేక సౌత్ ఇండియా సినిమాలు బాగా ఆడుతున్నాయనే అసూయో.. తెలియదు గాని నసీరుద్దీన్ సౌత్ సినిమాల మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి.
నసీరుద్దీన్ మాట్లాడుతూ.. “సౌత్ ఇండియన్ సినిమాలకు అసలు లాజిక్కే ఉండదు. సినిమా హిట్టైనా స్క్రిప్ట్ విషయంలో చాలా లోపాలు కనబడతాయి. దీనికి తోడు మధ్యలో వచ్చే పాటలు విసుగు తెప్పిస్తాయి. కొన్ని సీన్లు అయితే అసలు ఊహకు అందని విధంగా ఉంటాయి. బాలీవుడ్ సినిమాలతో పోల్చుకుంటే తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు మంచి విజయాన్ని దక్కించుకున్నా.. సౌత్ ఇండియన్ సినిమాల్లో అసలు లాజిక్ లేని సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి”. అని ఘాటుగా విమర్శలు చేసాడు. ప్రేక్షకులు హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారని.. హిందీ సినిమాలకంటే ఎక్కువ సౌత్ సినిమాలను కష్టపడి తీస్తారని ఈ సందర్భంగా తెలియజేశాడు. సౌత్ సినిమాలపై నసీరుద్దీన్ ఇన్ని విమర్శలు చేసిన తరుణంలో ఇప్పుడు నెటిజన్స్ ఇతన్ని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం నసీరుద్దీన్ “తాజ్ డివైడెడ్ బై బ్లడ్” అనే హిస్టారికల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అక్బర్ చక్రవర్తి గా కనిపించనున్నాడు. మరి నసీరుద్దీన్ సౌత్ ఇండియన్ సినిమా పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మీకెలా అనిపించాయి కామెంట్ రూపంలో తెలియజేయండి.