భీమ్లా నాయక్.. పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ. ఇప్పటికే ఈ సినిమా నుండి భీమ్లా నాయక్ లుక్ రిలీజ్ అయ్యింది. తరువాత రిలీజ్ అయిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కూడా అదిరిపోయింది. అయితే.. ఇప్పుడు రానా లుక్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇందులో పంచెకట్టులో రానా మాస్ లుక్ అదిరిపోయింది.
నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా.. స్టేషన్లో టాక్ నడుస్తోంది.. నేనేవరో తెలుసా.. ధర్మేంద్ర..హీరో అంటూ రానా చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. దీంతో.. రానా పాత్రని కూడా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తో ఏ మాత్రం తగ్గకుండా మలచినట్టు అర్ధం అవుతోంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. మరి.. రానా మాస్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.