రానా హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన మూవీ విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుుకుంది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు ప్రమోషన్ లో భాగంగా సాయిపల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో కాశ్మీర్ ఫైల్స్ తో పాటు గో రక్షకులపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. హీరోయిన్ సాయిపల్లవిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా సాయిపల్లవిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేవిధంగా మాట్లాడిన సాయి పల్లవి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
విరాట్ పర్వం మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్యూలో పాల్గొన్నా హీరోయిన్ సాయిపల్లవి.. “కాశ్మీరీ పండిట్ల హత్యలను, గోవులను అక్రమ రవాణా చేసే ఓ మతానికి చెందిన వ్యక్తిని కొట్టడాన్ని ఒకటే” అని అన్నారు. సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సాయిపల్లవిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.. సాయిపల్లవిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన సాయిపల్లవి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్ట్ పుస్తకాలు చదివి ఆమె మైండ్ పాడైందని.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని..ఆమెకు వాస్తవాలు మాట్లాడే ధైర్యం లేదన్నారు. కశ్మీర్ గురించి అక్కడి పండితులను కలిస్తే వాస్తవాలు తెలుస్తాయని హితవు పలికారు.
నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ప్రజలు తిరగబడి కొడతారని రాజాసింగ్ హెచ్చరించారు. “తెలంగాణతో పాటు ఏపీలోని అన్ని పోలీస్ స్టేషన్‌లో సాయి పల్లవిపై ఫిర్యాదు చేయండి. ఒకరిని అరెస్ట్ చేస్తే.. ఇక ఎవరూ హిందువుల జోలికి రాకుండా ఉంటారు. కొందరు వార్తల్లో నిలవాలని కావాల్సి.. ఇలా మాట్లాడుతున్నారు. తనను చేసిన వ్యాఖ్యలు సాయి పల్లవి ఉపసంహరించుకోవాలి. హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి కామెంట్స్ ఇతర మతలాపై చేస్తారా..?’ అని రాజా సింగ్ ప్రశించారు. మరి రాజాసింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.