Bithiri Sathi: ఈ మధ్య సినిమాలను ప్రమోట్ చేసే విధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. రిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్స్ సంగతి పక్కనపెడితే.. ప్రమోషనల్ ఇంటర్వ్యూలు మాత్రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇటీవల సినిమాలకు ఫుల్ క్రేజ్ తీసుకొస్తున్న ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కమెడియన్ బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు టాప్ లో ఉంటున్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమా మొదలుకొని.. సర్కారు వారి పాట, రీసెంట్ గా అంటే సుందరానికి ఇలా అన్ని వైరల్ గా మారాయి.
ఈ క్రమంలో కొత్తగా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాల దర్శకనిర్మాతలంతా సత్తితో ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ మూవీ జులై 1న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో హీరో గోపీచంద్ తో పాటు డైరెక్టర్ మారుతీ, హీరోయిన్ రాశిఖన్నా కూడా పాల్గొన్నారు.
ఇక ఇంటర్వ్యూ మొదలయ్యే ముందు సత్తి దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి.. పక్కా కమర్షియల్ టీమ్ వచ్చిందండి.. మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అని పిలిచాడు. ‘రాజమౌళి, ఎన్టీఆర్, మహేష్ బాబు, బన్నీలతో ఇంటర్వ్యూలు చేశా చూశావా.. మారుతీ సర్ వచ్చారంటే.. ఆయనేమన్నా ఇదా.. కాసేపాగి వస్తానని చెప్పుపో.. నన్ను బయట కూర్చోబెట్టి.. కనీసం ఛాయ్, బిస్కెట్ కూడా ఇవ్వలేదు. ఇంత కమర్షియలా.. పేరుకు తగ్గట్టే ఉన్నారు” అని అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక.. అదంతా ఊరికే అంటూ డైరెక్టర్ తో చెబుతూ నవ్వేశాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతోంది. మరి పక్కా కమర్షియల్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.