టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తర్వాత మరోసారి బ్లాక్ బస్టర్ సౌండ్ వినిపిస్తోంది. విక్రమ్, మేజర్ సినిమాల కాంబినేషన్ హిట్ తర్వాత ఇటీవల బింబిసార, సీతారామం సినిమాలు ఒకేరోజు విడుదలై అద్భుతమైనం విజయాలను ఖాతాలో వేసుకున్నాయి. అయితే.. నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ మూవీ తర్వాత చాలా ఏళ్లకు బింబిసారతో మంచి విజయాన్ని నమోదు చేశాడు. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడైనా సినిమాలను ఆదరిస్తారని నమ్మి.. ఈ సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు.
కమర్షియల్ హంగులు జోడించిన బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో బింబిసారకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. చాలా రోజుల తర్వాత బింబిసారతో బాక్సాఫీస్ వద్ద బెస్ట్ ఓపెనింగ్స్ రావడం విశేషం. కళ్యాణ్ రామ్ గత సినిమాలకు బింబిసార రెట్టింపు ఓపెనింగ్స్ తెచ్చిందని అంటున్నారు. మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసిన బింబిసార 4వ రోజు కూడా కలెక్షన్స్ నిలకడగా రాబట్టింది.
తెలుగు రాష్ట్రాలలో ‘బింబిసార’ 4 రోజుల కలెక్షన్స్ చూసినట్లయితే..
బింబిసారకు ఏపీ, తెలంగాణ కలిపి మొత్తం రూ. 17.93 కోట్ల షేర్ లభించింది. గ్రాస్ పరంగా.. 27.9 కోట్ల అని ట్రేడ్ వర్గాల సమాచారం. అమెరికాలో రూ 1.12 కోట్లు, రెస్ట్ ఆఫ్ ప్లేసెస్ లో రూ. 1.52 కోట్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా బింబిసార రూ. 20.57 కోట్ల షేర్.. రూ. 34.2 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కించారు. మరి బింబిసార మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Bimbisara 4 Days Total WW Collectionshttps://t.co/YpiDJLGSWU
A Good Monday! pic.twitter.com/bBrAuT9yrU
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) August 9, 2022