సెలబ్రిటీ హోదా సంపాదించుకోవడానికి ఎన్ని కష్టాలు పడాలో.. అది వచ్చాక.. దానితో కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సినీ, క్రీడా సెలబ్రిటీల విషయంలో ఈ ఇబ్బందులు మరి కాస్త ఎక్కువే ఉంటాయి. వారిని చూసేందుకు జనాలు ఎగబడతారు. సెలబ్రిటీలతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తారు. అయితే కొన్ని సార్లు.. ఫ్యాన్స్ తీరుతో సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే మన దేశంలో సెలబ్రిటీలు.. బాడీగార్డులు లేకుండా బయటకు రారు. పిక్నిక్, షాపింగ్ వంటి వాటి కోసం చాలామంది సెలబ్రిటీలు విదేశాలకు చెక్కేస్తుంటారు. అక్కడయితే.. వారిని గుర్తుపట్టి.. ఫోటోల కోసం ఎగబడి.. ఇబ్బంది పెట్టేవారు ఉండరు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బాడీ గార్డులు లేకుండా.. సెలబ్రిటీలు బయటకు వెళ్లాల్సిన వస్తే.. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో.. ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.
సెక్యూరిటీ లేకుండా స్టార్ హీరోయిన్ ఒకరు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చింది. అయితే ఆమెతో ఫోటోలు దిగేందకు ఎగబడ్డారు. ఫ్యాన్స్ అత్యుత్సాహం చూసి హీరోయిన్.. చెప్పులు కూడా వదిలేసి.. అక్కడ నుంచి పారిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇంతకు ఇలా పారిపోయిన హీరోయిన్ ఎవరంటే.. భోజ్‌పురి స్టార్ హీరోయిన్ అక్షరా సింగ్. బిహార్ రాష్ట్రం.. బేథియా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లింది అక్షరా సింగ్. సెక్యూరిటీ లేకుండా.. ఎన్నికల ప్రచారానికి వెళ్లింది. నిర్వాహాకులు కూడా ఆమెకు ప్రత్యేక భద్రత కల్పించలేదు.
అభిమాన హీరోయిన్ తమ మధ్యకు వస్తే జనాలు ఊరుకుంటారా.. ఆమెను చూసేందుకు.. ఎగబడ్డారు. సెల్ఫీ కోసం పరుగులు తీశారు. అభిమానుల అత్యుత్సాహం చూసి అక్షరా సింగ్‌కు భయం వేసింది. కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా.. అక్కడ నుంచి పారిపోయింది. అక్షరా సింగ్ స్కూటీ మీద వెళ్తుండగా.. అభిమానులు ఆమె వెనక పరిగెత్తారు. చూసేవారికి.. ఏదో తప్పు చేసిన వారిని తరుముతున్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. అభిమానులు తమ అత్యుత్సాహంతో.. సెలబ్రిటీలను ఇలా ఇబ్బంది పెట్టడం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.