సినీ ఇండస్ట్రీలో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఓ యువ హీరో అకాలంగా కన్నుమూయడం.. ఇండస్ట్రీ వర్గాలను, ప్రేక్షక్షులను సైతం షాక్ కి గురి చేస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు, బిగ్ బాస్ సీజన్ 13 విజేత సిద్ధర్థ్ శుక్ల నేడు గుండే పోటుతో మరణించారు. తనదైన నటన, టాలెంట్ తో బాలీవుడ్ లో ప్రామిసింగ్ యాక్టర్ గాపేరు తెచ్చుకున్నాడు సిద్ధర్థ్.
హిందీ బిగ్ బాస్ సీజన్-13 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని, తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించి, విజేతగా నిలిచాడు సిద్ధర్థ్ శుక్ల. ఇక్క అక్కడ నుండి సిద్ధర్థ్ కి తిరుగు లేకుండా పోయింది. పలు టీవీ షోలకి హోస్ట్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, సపోర్టింగ్ రోల్స్ లో నటించి మెప్పించాడు. ఇప్పుడిప్పుడే స్టార్స్ పక్కన నటించే అవకాశాలను దక్కించుకుంటున్న సిద్దార్ద్.. ఇలా 40 ఏళ్ల వయసులోనే హఠాత్తుగా గుండె పోటుతో మరణించడంతో హిందీ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్ధర్థ్ శుక్ల మరణం పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.