నేటి ఆధునిక టెక్నాలజీ యుగంలో ఎక్కడ ఏం జరిగినా గానీ మనకు క్షణాల్లో తెలిసిపోతుంది. ఇక మీమర్స్, ట్రోలర్స్ కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతకాదు. కానీ ఈ ట్రోలర్స్ అప్పుడప్పుడు మితిమీరుతున్నారు అని చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ సోహెల్. బిగ్ బాస్ 4 తో వచ్చిన క్రేజ్ ద్వారా హీరోగా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు సోహెల్. ఇక తాజాగా సోహెల్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’ న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మంగళవారం ప్రీ రిలీజ్ వేడుకు నిర్వహించింది చిత్ర బృందం. ఈ వేడుకలో ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు సోహెల్.
బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది క్రేజ్ సంపాదించుకున్నారు. దాంతో పాటుగా కెరీర్ లో వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకెళ్తున్నారు. అలా కెరీర్ లో దూసుకెళ్తున్న వారిలో సోహెల్ ఒకడు. ఇక హీరోగా ‘లక్కీ లక్ష్మణ్’ అనే చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేయనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు హీరో సోహెల్. ఈ వేడుకలో సోహెల్ మాట్లాడుతూ..”గత కొంత కాలంగా నాపై, నా ఫ్యామిలీపై కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు. నేను బిగ్ బాస్ 4లో స్కామ్ చేసి వచ్చానని అంటున్నారు. కానీ నా బాధ ఎవరీకి తెలీదు. ఆ రోజు నేను రూ. 25 లక్షలు తీసుకుని బయటకి వచ్చాను. అప్పుడు ఆ మనీ నాకు చాలా అవసరం. ఆ డబ్బుతో నా చెల్లిలి పెళ్లి చేశాను. ఓ మధ్యతరగతి అన్నగా చెల్లిలి పెళ్లి చేయడం ఎంత కష్టమో తెలుసా? నాకు తెలుసు. అందులో మరికొంత మనీని ఓల్డేజ్ హోంకు ఇచ్చాను. కానీ ఇవన్నీ తెలీకుండా నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తుండటం చూసి బాధేసింది” అని ఉద్వేగానికి లోనైయ్యాడు సోహెల్.
మరోసారి నా ఫ్యామిలీపై ఇలాంటి ట్రోల్స్ చేస్తే ఒక్కొక్కడిని వెతికిమరీ కొడతానని వార్నింగ్ ఇచ్చాడు సోహెల్. నాలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే.. సమాజానికి మరింత సాయం చేస్తానని చెప్పుకొచ్చాడు. తన తండ్రి గురించి చెబుతూ భావోద్వేగాని గురయ్యాడు సోహెల్. నా సక్సెస్ వెనుక ఉన్నది మా నాన్నే అని అన్నాడు. ఇక సినిమా కోసం కష్టపడ్డ ప్రతీఒక్కరు గెస్టులే.. అందుకే ఈ సినిమాకు ప్రత్యేకించి అతిథులను పిలవలేదు అని అన్నాడు. నన్నే కాదు ఏ హీరోలను కూడా ఇలా నెగటీవ్ గా ట్రోల్స్ చేయకండని రిక్వెస్ట్ చేశాడు. ఇక ‘లక్కీ లక్ష్మణ్’ సినిమాకు ఏఆర్ అభి దర్శకత్వం వహించగా.. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై హరిత గోగినేని నిర్మించారు. సోహెల్ కు జంటగా మోక్ష నటించింది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. సోహెల్ బిగ్ బాస్ 4 నుంచి రూ. 25 లక్షలు తీసుకుని బయటికి రావడంతో అభిజీత్ బిగ్ బాస్ విజేతగా నిలిచిన సంగతి మనందరికి తెలిసిందే. అప్పటి నుంచే సోహెల్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు.