తమిళ స్టార్ హీరో సూర్యకి ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక పక్క మాస్ సినిమాలు చేస్తూనే, మరోవైపు విలక్షణమైన సినిమాలలో కూడా నటించడం సూర్యకి మాత్రమే చెల్లింది. ఈ కారణంగానే సూర్యకి తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక సామాన్య అభిమానులు మాత్రమే కాకుండా.. సెలబ్రెటీలు కూడా సూర్య ఫ్యాన్స్ లిస్ట్ లో ఉన్నారు.
బిగ్ బాస్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ కూడా ఈ కోవలోకే వస్తాడు. హీరో సూర్య అంటే తనకి ప్రాణం అంటూ.. షన్ను ఇదివరకే చాలాసార్లు బాహాటంగా చెప్తూ వచ్చాడు. అయితే.. ఇటీవల షన్ను తన అభిమాన హీరో సూర్యని కలుసుకున్నాడు. సూర్యను కలిసిన సమయంలో షణ్ముఖ్ జస్వంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఏకంగా షన్ను కంటతడి పెట్టుకున్నాడు.
‘ఈటీ’ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రచారం నిమిత్తం హైదరాబాద్ వచ్చిన సూర్య.. షన్నుని దగ్గరికి తీసుకుని.. అతని యాక్టింగ్ గురించి కూడా మాట్లాడటం విశేషంగా చెప్పుకోవాలి. ఇక సూర్యని కలిసిన తర్వాత షన్ను.. చాలా ఆనందంతో ట్వీట్ కూడా చేశాడు. “సూర్య అన్నా.. ఐ లవ్ యు.. 3-3-2022.. ఎప్పటికీ హ్యాపీయెస్ట్ డే. కొన్ని నెలలుగా చాలా ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత హ్యాపీగా ఉన్నాను” అని షణ్ముఖ్ ట్వీట్ చేయడం గమనార్హం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.