Shanmukh Jaswanth: యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. సోషల్ మీడియాలో విశేషమైన ఫాలోయింగ్ కలిగిన షణ్ముఖ్.. బిగ్ బాస్ తర్వాత పెద్దగా వార్తల్లో కనిపించలేదు. బిగ్ బాస్ లో అడుగు పెట్టినప్పుడే మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న షన్నుకి అందరూ కప్పు కొట్టేస్తాడని భావించారు. కానీ చివరికి రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. అయినా సోషల్ మీడియాలో షన్నుకు ఫ్యాన్స్ సపోర్ట్ ఏమాత్రం తగ్గలేదు.
దీప్తి సునైనాతో విడిపోయాక షన్ను పూర్తిగా తన కెరీర్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో షన్ను టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఇక ఈ సిరీస్ ని షన్నుతో ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’, ‘సూర్య’ లాంటి యూట్యూబ్ సిరీస్ లు రూపొందించిన సుబ్బు తెరకెక్కిస్తుండటం విశేషం.
షన్ను – సుబ్బు కాంబినేషన్ లో వచ్చిన ఈ రెండూ సిరీస్ లు యూట్యూబ్ లో భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు మూడోసారి ఈ కాంబినేషన్ లో ఏకంగా ఆహా లాంటి ఓటిటి వెబ్ సిరీస్ రావడం అనేది విశేషంగానే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు షన్ను. తాజాగా ఆ షూటింగ్ లొకేషన్ లో షన్నుకి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో చూస్తే షన్ను ఒంటినిండా గాయాలతో కనిపిస్తూ నవ్వుతున్నాడు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.