బిగ్ బాస్ రియాలిటీ ఇప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటిసారి ఓటిటి సీజన్ తెలుగులో ప్రారంభం కాబోతుండటంతో ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా రానున్నారనే ఆసక్తి నెలకొంది. అయితే.. ఇటీవలే బిగ్ బాస్ ఓటిటి డేట్ ప్రకటించేశారు. ఫిబ్రవరి 26 నుండి డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న ఓటిటి సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరించనున్నారు.
నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ కాబట్టి.. ఇకపై హాట్ స్టార్ లో 24 గంటలపాటు బిగ్ బాస్ టెలికాస్ట్ కానుంది. అయితే.. ఇదివరకు చెప్పినట్లుగానే ఈసారి ఓటిటి సీజన్ లో కొత్తవారితో పాటు గత సీజన్స్ లో పాల్గొన్నవారు కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ ఓటిటిలో పాల్గొనబోయే సభ్యుల లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఓటిటి సీజన్ లో 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటారని సమాచారం.
ఇక బిగ్ బాస్ ఓటిటిలో పాల్గొనే 17 మంది లిస్ట్ చూసినట్లయితే..
పాత కంటెస్టెంట్స్:
1. కమెడియన్ ధనరాజ్ (సీజన్ 1)
2. ముమైత్ ఖాన్ (సీజన్ 1)
3. ఆదర్శ్ (సీజన్ 1)
4. తనీష్ (సీజన్ 2)
5. తేజస్వి (సీజన్ 2)
6. అషు రెడ్డి (సీజన్ 3)
7. అరియానా గ్లోరి (సీజన్ 4)
8. మహేష్ విట్టా (సీజన్ 4)
9. సరయు (సీజన్ 5)
10. హమీదా (సీజన్ 5)
11. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
కొత్త కంటెస్టెంట్స్:
12. యూట్యూబర్ నిఖిల్
13. యాంకర్ స్రవంతి చొక్కారపు
14. RJ చైతు
15. యాంకర్ శివ
16. బమ్ చిక్ బబ్లూ
17. కప్పు ముఖ్యం బిగులూ ఫేమ్ వెంకట్ (సన్నీ ఫ్రెండ్)
ఈ 17 మందిలో పలు మార్పులు జరిగితే మాత్రం ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా ఓటీటీ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 84 రోజులపాటు(అంటే 12 వారాలు) కొనసాగే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఎలా ఉండబోతుందో చూడాలి. కొన్ని వారాలపాటు వచ్చే స్పందన బట్టి మరిన్ని వారాలు పెంచే దిశగా బిగ్ బాస్ యాజమాన్యం యోచిస్తున్నట్లు టీవీ వర్గాలు చెబుతున్నాయి. మరి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.