ఈ మధ్యకాలంలో సూపర్ క్రేజ్ దక్కించుకున్న తెలుగు రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటివరకు ఐదు సీజన్లు ముగిసాయి. ఫిబ్రవరి లోనే 6వ సీజన్ మొదలు కానుందని టాక్ నడుస్తుంది. అయితే.. బిగ్ బాస్ అనేది ఎంత ఫేమ్ తీసుకొస్తుందో.. అంతే పెంట పెడుతుంది. కొందరిని పాజిటివ్ గా, ఇంకొందరిని నెగటివ్ గా బయట జనాలకు పరిచయం చేస్తుంది. బిగ్ బాస్ 2వ సీజన్ విన్నర్ కౌశల్ అనే సంగతి అందరికి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ అనంతరం.. కౌశల్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా కనిపించకుండా పోయాడు.
ఇక తాజాగా కౌశల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని బిగ్ బాస్ జర్నీ గురించి మాట్లాడాడు. కౌశల్ మాట్లాడుతూ.. ‘నా ముక్కుసూటి తనం హౌస్‌లో ఉన్నప్పుడు ఎవరికీ నచ్చేది కాదు.. బయట కూడా అంతే ఎవరికీ నచ్చదు. నాకు బిగ్ బాస్ తరువాత నాకు సినిమా అవకాశాలు రాకపోవడానికి ఇదే కారణం కావచ్చు. నాతో మాట్లాడని వాళ్లు చాలామంది నాకు యాటిట్యూడ్ ఎక్కువని అనుకుంటారు. సినిమా ఛాన్స్ కోసం ఎవరైనా డైరెక్టర్ దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకుని కాకాపట్టే నేచర్ కాదు నాది.ఇక ఎవరైనా నా గురించి నెగిటివ్ గా మాట్లాడి.. కెలికితే నాకు ఎక్కడో టచ్ అవుతుంది. నా ఎక్స్‌పీరియన్స్ అంత వయసు లేని దీప్తి సునయన.. కౌశల్ రెండు వారాల్లోనే వెళ్లిపోతాడని అన్న మాటలను నాని గారు నాకు టీవీలో ఎప్పుడైతే చూపించారు. అప్పుడే నేనేంటో చూపించాలి అనుకున్నా. వీళ్లతో పాటు ప్రపంచానికి కూడా చూపించాలనుకున్నా. రెండో వారంలోనే నేను వెళ్లిపోతానని నా ప్రోమో కూడా రెడీ చేశారు. కానీ ఓటింగ్ మరో గంటలో క్లోజ్ అవుతుందన్నప్పుడు ఆ నిమ్మకాయ నా కళ్లలోకి పిండే ఎపిసోడ్ రావడం.. నా రాత మారడం జరిగింది. ఆ నిమ్మకాయ ఎపిసోడ్ అప్పుడు టెలికాస్ట్ కాకుండా తరువాత అయితే నేను రెండోవారంలోనే ఎలిమినేట్ అయ్యేవాడిని” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కౌశల్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి కౌశల్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.