పేద, ధనిక అనే తేడ లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే కోరిక.. తమకంటూ ఓ చిన్న ఇల్లు ఉండటం. ప్రతి ఒక్కరు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహరంగా మారింది. పల్లెటూరిలో ఇల్లు కట్టాలన్న లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇక అదే పట్నంలో అంటే మాటలు కాదు. ఖర్చు తడిసి మోపెడవుతుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు. అయితే ఖర్చు సంగతి ఎలా ఉన్నా సరే… సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు సెలబ్రిటీలు. తాజాగా ఈ జాబితాలో బిగ్ బాస్ బ్యూటీ హిమజ కూడా చేరారు. తన డ్రీమ్ హౌస్ నిర్మాణం మొదలు పెట్టినట్లు తెలిపారు. అంతేకాక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తన కలల సౌధం వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
మొత్తం నాలుగంతస్తుల్లో తన డ్రీమ్ హౌజ్‌ని నిర్మిస్తున్నట్లు తెలిపింది హిమజ. ఇందులో మోడ్రన్ లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. తన తల్లిదండ్రుల కోసం గ్రౌండ్ ఫ్లోర్‌లోనే బెడ్‌రూమ్ ఏర్పాటు చేశానంది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం తనదేనన్న ఆమె ప్రత్యేకంగా మేకప్ రూమ్ కూడా నిర్మిస్తున్నానని చెప్పింది. దానిపై ఫ్లోర్‌లో జిమ్, ఆపై దాంట్లో థియేటర్ ఉండేలా ఏర్పాటు చేస్తున్నానంది. నాలుగంతస్తులు కట్టడానికి, అందులో ఇంటీరియర్ డిజైన్‌కు మొత్తంగా ఒక ఏడాది పడుతుందని చెప్పుకొచ్చింది. అంతేకాక గతంలో భూమి పూజకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది హిమజ. ఆ సమయంలో ఆమె ఇంటి నిర్మాణం కోసం పారపట్టి.. మట్టి ఎత్తింది. అంతేకాకుండా అక్కడ పని చేస్తున్న వారికి భోజనం కూడా వడ్డించింది.