బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో సందడి చేసిన తేజస్వి – షోలో అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ భామ కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే సినిమాల్లో నటించి తన అందాలతో అదర గొట్టింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న తేజస్వి వీలున్నప్పుడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ఫోటోలతో సోషల్‌మీడియాను కుదిపేస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించి టాలీవుడ్ కి పరిచయం అయింది. ఆ తర్వాత మనం, హార్ట్ ఎటాక్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కేరింత , శ్రీమంతుడు వంటి చిత్రాలలో నటించి స్టార్ నటిగా ఎదిగింది.
మొన్నీ మధ్యే బికినీ ఫోటోలతో కూడా అభిమానులకు కావాల్సినంత ట్వీట్ ఇచ్చింది. తేజస్వి పిక్స్ పోస్ట్ చేస్తే చాలు అవి వైరల్ అవుతున్నాయి. తన అభిమానులకు ఎప్పటికప్పుడు అప్ డేట్ లు ఇస్తూ వారిలో ఎంతో జోష్ నింపే తేజస్వి గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. రీసెంట్ గా ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తేజస్వి. ఈ పోస్టులో తాను చిన్నప్పుడు పానీ పూరి అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నేను చిన్న పిల్లను కాదు కదా అసలు ఇప్పుడు పెళ్లి అవసరం లేదు అనిపిస్తుంది అంటూ పానీపూరి బండి తోసుకుంటున్నట్లు ఉండే గుర్తును పెట్టీ తన ఫోటో షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తేజస్వి సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. చివరిగా మన ముగ్గురి లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్ లో నటించిన తేజస్వి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి బోల్డ్ వెబ్ సిరీస్ లు చేస్తారో చూడాలి.