గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వర్ధమాన నటి గాయత్రి డాలీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఇండస్ట్రీ వర్గాలను కలచి వేసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుఎన్సర్‌గా, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఎంతో మంది ఫ్యాన్స్ సంపాదించుకుంది గాయత్రి. ఇప్పుడిప్పుడే వెండితెరపై కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇన్ స్టాగ్రామ్‌లోనూ గాయత్రి డాలీకి మంచి ఫాలోయింగ్ ఉంది. యాక్టింగ్ లోనూ మంచి మార్కులే వచ్చాయి.
ఇదీ చదవండి:హోళీ రోజు విషాదం.. కత్తితో డ్యాన్స్.. ఎవ్వరూ ఊహించని పరిణామం
సోషల్ మీడియా, యూట్యూబ్ స్టార్లు అందరికీ నెక్ట్స్ స్టెప్ వారి కెరీర్ ను ఎస్టాబ్లిష్ చేసుకోవడం. సెలబ్రిటీ అనే హోదాను పొందడం. సినిమా రంగంలోనూ మంచి అవకాశాలు సంపాదించడం. అలా చిన్నచిన్నగా తమ కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటారు. ఈ క్రమంలో గాయత్రీ డాలీ ఇప్పుడిప్పుడే సెలబ్రిటీ హోదాను అందుకోబోతోంది. సినిమా రంగంలోనూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఇలాంటి తరుణంలో గాయత్రీ కారు ప్రమాదంలో మృతిచెందడం ఎంతో బాధాకరం.
గాయత్రీ డాలీ మృతిపై షణ్ముఖ్ జశ్వంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఆమెతో కలిసి నటించిన క్షణాలను ఇన్ స్టాగ్రామ్ స్టోరీగా షణ్ముఖ్ షేర్ చేశాడు. పోస్ట్ లో హార్ట్ బ్రేక్ అయిన సింబల్ ను పెట్టాడు. గాయత్రి డాలీ శ్రీహాన్, సిరి హన్మంత్‌తోనూ వెబ్ సిరీస్‌లలో నటించింది. శ్రీహాన్, సిరి హన్మంత్ కూడా ఆమె మృతితో షాక్ కు గురయ్యారు. గాయత్రీ డాలీతో ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గాయత్రీ డాలీ నిన్ను మిస్ అవుతున్నాం అని బ్రోకెన్ హార్ట్ సిబంల్ ను పెట్టారు. గాయత్రీ డాలీ మృతిపై సోషల్ మీడియాలో ఫాలోవర్స్, అభిమానులు, ఆమెతో కలిసి నటించిన ఎంతో మంది ఆమెతో ఉన్న జ్ఞాపకాలను షేర్ చేస్తున్నారు. ఒక మంచి యాక్టర్ కావాల్సిన గాయత్రీ డాలీ ఇలా మరణించడం ఎంతో మందిని కలచి వేస్తోంది. గాయత్రీ డాలీ హఠాన్మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.