ఇటీవలే కొందరు నటీమణులు అమ్మలుగా ప్రమోషన్లు పొందారు. ఆ జాబితాలో ప్రముఖ నటి, బిగ్ బాస్ బ్యూటీ ఒకరు చేరారు. శనివారం ఆమె పండంటి మగ బిడ్డకు జన్మిచ్చారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడిాయాలో వైరల్ అవుతోంది.
సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిగా ఉంటారు. అలానే నటీనటులు సైతం తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటారు. కొందరు సెలబ్రిటీలు తమ ఇంట ఏ శుభకార్యం జరిగిన క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇకపోతే ఇటీవలే కొందరు నటీమణులు అమ్మలుగా ప్రమోషన్లు పొందారు. ఆ జాబితాలో ప్రముఖ నటి, బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్ చేరారు. శనివారం ఆమె పండంటి మగ బిడ్డకు జన్మిచ్చారు. ఇదే విషయాన్ని ఆమె భర్త, ఫేమస్ విలన్ జాన్ కొక్కెన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీమణుల్లో పూజా రామచంద్రన్ ఒకరు. నిఖిల్ హీరోగా నటించిన స్వామిరారా సినిమాలో ఈ బ్యూటీ నటించింది. ఈ సినిమాలో నిఖిల్ పక్కన నటించి మంచి మార్కులు సొంతం చేసుకుంది. ఇలానే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళంలో బిగ్ బాస్ హౌస్లోకి ఈ అమ్మడు వెళ్లింది. ఆ షో ద్వారా పూజకు మంచి ఫేమ్ వచ్చింది. ఆ తరువాత కాంచన-2, దోచేయ్, త్రిపుర, దళం, వెంకీ మామ, పవర్ ప్లే వంటి సినిమాల్లో నటించింది.
అలానే ఆమె భర్త జాన్ కొక్కెన్ విలన్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. కేజీఎఫ్, కబ్జా, వీరసింహారెడ్డి, తెగింపు వంటి తదితర సినిమాలో విలన్ గా నటించాడు. కొన్నాళ్ల క్రితం తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని పూజ స్వయంగా వెల్లడించారు. ఆ తరువాత తరచూ తనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ మంచి ట్రీట్ ఇస్తున్నారు. తాజాగా వారి అభిమానులకు పూజా రామచంద్రన్ దంపతులు శుభవార్త చెప్పారు. శనివారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయాన్ని పూజ భర్త, కొక్కెన్ సోషల్‌మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా తాను తండ్రయ్యానంటూ జాన్ మురిసిపోయాడు. అంతేకాక బిడ్డ పుట్టిన కొన్ని గంటల్లోనే పేరు కూడా పెట్టేశారు. తమ కొడుకు కియాన్ కొక్కెన్ అని నామకరణం చేసినట్లు ఈ దంపతులు ప్రకటించారు. దీంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు పూజ-జాన్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి.. మీరు కూడా మీ విషెష్ ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.