టిక్ టాక్ వీడియోస్, యూట్యూబ్ తో కెరీర్ ప్రారంభించిన మెహబూబ్ ఆ తర్వాత బిగ్ బాస్ ఆఫర్ అందుకున్నాడు. గతంలో రాని నేమ్, ఫేమ్‌ను బిగ్ బాస్‌తో సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత మెహబూబ్‌కు సెలబ్రిటీ హోదా దక్కింది. బిగ్ బాస్ పూర్తయ్యాక మళ్లీ షూట్స్, వెబ్ సిరీస్ అంటూ ఫుల్ బిజీ అయిపోయాడు. లైఫ్‌లో బాగా ఎదుగుతున్న సమయంలో మెహబూబ్ జీవితంలో ఊహించని ఘటన జరిగింది.
సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తన తల్లిని గుర్తుచేసుకుని మెహబూబ్ భావోద్వేగానికి గురయ్యాడు. తాను ఎంతగానో ప్రేమించే తన తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆగస్టు 5న జరిగిన ఈ ఘటన అతని జీవితంపై ఎంతో ప్రభావం చూపిందంటూ చెప్పుకొచ్చాడు. తల్లిలేని లోటుని ఎవ్వరూ పూడ్చలేరంటూ మెహబూబ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
“ఆగస్టు 5న షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల అమ్మీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నాకు ఫోన్ చేయగానే నేను హైదరాబాద్ నుంచి గుంటూరు బయల్దేరాను. నేను ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉండగా అమ్మీ తుదిశ్వాస విడిచింది. నాకు ఏం అర్థం కాలేదు. గతంలోనూ అమ్మీకి ఆరోగ్యం బాగోకపోతే ఆస్పత్రిలో చేర్పించాము. అప్పుడు రూ.13 లక్షలు ఖర్చు అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి గారు రూ.10 లక్షల చెక్ ఇచ్చారు. నా దగ్గర ఉన్న డబ్బుతో అమ్మను కాపాడుకున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.
“కానీ, కొన్నాళ్లకే అమ్మీ ఇలా మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. నేను ఏం సాధించినా చూసేందుకు అమ్మలేదు. బయట పరిస్థితులు బాలేదు. పేరెంట్స్ ను జాగ్రత్తగా చూసుకోండి. ఎంత డబ్బున్నా పేరెంట్స్ లేకపోతే ఏం చేసుకోలేం. వాళ్లు ఉన్నప్పుడే వాళ్లని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్లకి ఏం కావాలో సమకూర్చండి. వాళ్లని ఆనందంగా ఉంచండి” అంటూ మెహబూబ్ ఎమోషనల్ అయ్యాడు. మెహబూబ్ ఫుల్ ఇంటర్వ్యూని ఈ కింది వీడియోలో చూడండి.