కార్తీకదీపం సీరియల్ కు బుల్లితెరలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం స్టోరీలో ఇచ్చిన ట్విస్ట్ తో అంతా ఈ సీరియల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలను తీసేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కథను ఏ మలుపు తిప్పుతారో అనే ఆతురత పెరిగింది. అయితే ఇక నుంచి కార్తీక దీపం సీరియల్ మొత్తం నెక్ట్స్ లెవల్లో ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. డాక్టర్ బాబు, వంటలక్క కారు ప్రమాదంలో చనిపోవడం. అన్యోంన్యంగా ఉండే అక్కాచెళ్లెల్లే శత్రువులుగా మారడం. సీరియల్ లో కొత్త కోణాన్ని బయటపెట్టింది.
ఇదీ చదవండి: కార్తీకదీపం సీరియల్‌లో ఇక కనిపించను: డాక్టర్ బాబు
సీరియల్ పేరు, సౌందర్య, ఆనందరావులు మినహా మొత్తం కొత్తవాళ్లే రానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మౌనిత క్యారెక్టర్ ను కూడా తప్పించిన బృందం అందరూ కొత్త వాళ్లతో సీరియల్ ను సరికొత్తగా తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా రాబోయేవాళ్ల లిస్ట్ లీకైంది. అందులో బిగ్ బాస్ సీజన్ ఫేమ్ మానస్ నాగులపల్లి కార్తీకదీపం సీరియల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. హిమ- శౌర్య పాత్రలు పెద్దవాళ్లు అవుతారు. వారిలో ఒకరి జోడీగా మానస్ ఎంట్రీ ఇస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఎవరికి జోడీ కట్టబోతున్నాడు హిమకా? శౌర్యకా? అనేది తెలియాల్సి ఉంది.మానస్.. కోయిలమ్మ సీరియల్ తో తనలోని నటనను నిరూపించుకోగా.. బిగ్ బాస్ తో తన వ్యక్తిగత జీవితాన్ని పరిచయం చేశాడు. తను ఎంత కామ్ అండ్ కంపోస్డ్ గా ఉంటాడో ప్రేక్షకులకు చూపించాడు. ఫైనల్ లో టాప్-4 స్థానంతో సరిపెట్టుకున్నా కూడా.. తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడనే చెప్పాలి. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు కాబట్టే మానస్ ను కార్తీక దీపం సీరియల్ కు ఎంచుకున్నారని తెలుస్తోంది. హిమ- సౌర్య పాత్రలు ఎవరూ చేయబోతున్నారు అనేదానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత ప్రారంభం కానున్న షూటింగ్ షెడ్యూల్ లో మానస్ పాల్గొంటాడని సమాచారం. మానస్ కార్తీకదీపం సీరియల్ లోకి వస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.