ఈ మధ్యకాలంలో సినీతారలు, సీరియల్ ఆర్టిస్టులతో పాటు బుల్లితెరపై ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీలు సైతం హోమ్ టూర్ అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ ఇప్పటివరకూ తమ ఇల్లు ఎలా ఉంటుందో చూడలేదంటూ సెలెబ్రిటీలంతా వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలను యూట్యూబ్ లో సొంత ఛానల్స్ లో అప్ లోడ్ చేస్తూ ఫ్యాన్స్ కి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ హోమ్ టూర్ జాబితాలోకి బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ హిమజ చేరింది. హిమజ గతంలో ఓ ఇల్లును హోమ్ టూర్ వీడియో చేసినప్పటికీ, బిగ్ బాస్, సినిమాల ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. సినిమాల ద్వారా ప్రేక్షకులకు చేరువైన హిమజ.. ఇటీవల మరో హోమ్ టూర్ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ప్రొఫెషన్ నిమిత్తం హైదరాబాద్ లో నివాసం ఉంటున్న హిమజ.. హోమ్ టూర్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి హిమజ హోమ్ టూర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.