చిత్రపరిశ్రమలో కొన్నేళ్లుగా కాస్టింగ్ కౌచ్ అనే పదం బాగానే వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్స్ దగ్గరనుండి జూనియర్ ఆర్టిస్ట్ ల వరకు అందరూ కాస్టింగ్ కౌచ్ మూలంగా వారు ఎదుర్కొన్న పరిస్థితులను బయటపెట్టారు. ఇప్పటికీ ఈ విషయంపై టాలీవుడ్ లో కూడా మెల్లమెల్లగా ఓపెన్ అవుతున్నారు ఆర్టిస్టులు. అయితే.. ఇండస్ట్రీ అన్నాక కెరీర్ పరంగా కష్టాలనేవి ఎవ్వరికీ తప్పవు. కానీ.. సినీ అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు, చీటింగ్స్ కారణంగా చాలాయేళ్లుగా ఎంతోమంది కెరీర్స్ పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఇదే కాస్టింగ్ కౌచ్ విషయంపై మొదటిసారి స్పందించింది బిగ్ బాస్ దివి. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ని ఎలా ఫేస్ చేశారు.. మీకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. “నేను ఇప్పటివరకు కాస్టింగ్ కౌచ్ అనేది ఫేస్ చేయలేదు. మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్.. ఇలా నాకు వచ్చిన అవకాశాలను అందుకుంటూ వచ్చాను. అందుకే అలాంటి ప్రాబ్లెమ్స్ నాదాకా రాలేదు. మన ప్రవర్తన బట్టి కూడా ఎదుటివారు ప్రవర్తిస్తుంటారు. వారెవరికీ నా గురించి లేదా నాతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడంతా చదువుకుని అన్ని తెలిసినవారే ఉన్నారు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి కమిట్మెంట్(కలిసి ఎంజాయ్ చేయడం) అవ్వడంలో అభ్యంతరం లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువగా అదే జరుగుతోంది” అని చెప్పుకొచ్చింది దివి.
ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ పై దివి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన దివి.. బిగ్ బాస్ లో అడుగుపెట్టి సూపర్ క్రేజ్ దక్కించుకుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుని.. కెరీర్ పరంగా దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉండే దివి.. ఇటీవల నయీమ్ డైరీస్ మూవీలో రొమాంటిక్ సీన్స్ లో చెలరేగిపోయింది. ఇప్పుడిప్పుడే నటిగా బిజీగా అవుదామనుకుంటున్న దివి.. తనకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశం ఇస్తే.. రెమ్యూనరేషన్ తీసుకోనని చెప్పడం విశేషం. చూడాలి మరి మున్ముందు స్టార్ హీరోల సినిమాలలో కనిపిస్తుందేమో!