ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలు కూడా సందడి చేస్తున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందంతో, అభినయంతో పాపులారీటినికి కూడా భారీగా పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి, బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా ఒకరు. చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.
బిగ్ బాస్ షో ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఈ బ్యూటీ మరొకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తన హాట్ అందాలతో కుర్రాళ్లకు మత్తెకిచ్చేస్తుంది ఈ బ్యూటి. ప్రస్తుతం దివికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమాలు, షోలతో పోలిస్తే సోషల్ మీడియా ద్వారానే దివి ఎక్కువగా పాపులారిటీని సంపాందించుకుంది. అయితే మొదట పలు సినిమాలో నటించి.. గుర్తింపు సంపాందించింది. తెలుగు బిగ్ బాస్ సీజన్4లో పాల్గొన్ని మిగిలిన వారికి గట్టిపోటి ఇచ్చింది. కొన్ని వారాల పాటు షోలో దివి రాణించింది.
బిగ్ బాస్ షో అనంతరం దివికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. దీంతో సినిమాలో మరిన్ని అవకాశాలు లభించాయి. 'మహర్షి' తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించింది. ఇటీవల 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవితో కలసి నటించింది. ఈ సినిమాలో దివి నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ సినిమాలో కూడా దివి ఓ చిన్న పాత్రలో చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమాలో, షోల్లో బిజీ బిజీగానే ఉంటూ సోషల్ మీడియాలో సైతం ఈ అమ్మడు యాక్టీవ్ గా ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలా తక్కువ సమయంలోనే ఫాలోయింగ్ పెంచుకుంది. ఇన్ స్ట్రా గ్రామ్ లో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్ ని ఆకట్టుకుంటుంది.
మాటలతో కంటే దివి ఫోటోలతోనే ఎక్కువగా మాయ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా మరో సారి తెల్లరంగు గౌనులో తన సోయగాలకు, చురకత్తుల లాంటి తన చూపులను యాడ్ చేసింది. బోల్డ్ లుక్ లో ఈ బ్యూటీ కుర్రాళ్లను కవ్విస్తుంది. తెల్ల చొక్కను ధరించి కాఫీ తాగుతూ తన అందాలను విందు చేసింది.
'నీతో ఒక్క కప్పు కాఫీ కోసం ఎదురు చూస్తూ, అదే తలచుకుంటూ ఒంటరిగానే తాగేస్తున్నా' అంటూ ఓ మెసేజ్ ను తన ఫోటోలకు జోడించింది. తన గ్లామర్ తో షోతో కుర్రాళ్లకు అందాల విందు చేస్తుంది. తన థైస్ అందాలను చూపిస్తూ.. కవ్విస్తోంది. ఇక తాను కూర్చిలో కూర్చున్నాగానీ.. ఆభరణాలు లేని మహరాణిలా ఉంది. ప్రస్తుతం దివి తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.