దివి వాద్త్యా.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదనే చెప్పాలి. ఇటీవలి కాలంలో సినిమాలు, సాంగ్స్, సోషల్ మీడియా అంటూ బాగానే పాపులర్ అయ్యింది. ముఖ్యంగా బిగ్ బాస్ అనే షోతో ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆమెను ఇప్పటికీ బిగ్ బాస్ దివి అనే పిలుస్తుంటారు. ఆ బిగ్ బాస్ వల్లే ఈమె జీవితం మలుపు తిరిగింది అని చెప్పవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ కార్యక్రమంలో మెగాస్టార్ ఈమెకు సినిమాలో ఛాన్స్ ఇస్తానని మాటిచ్చారు. అన్నట్లుగానే గాడ్ ఫాదర్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఆ తర్వాత ఆమెకు మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ దివి ఒక స్పెషల్ సాంగ్ లో తళుక్కుమంది.
బిగ్ బాస్ దివి తాజాగా రుద్రంగి అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. జాజిమొగులాలి అంటూ ఓ పక్కా ఫోక్ సాంగ్ తో ఈ బ్యూటీ అలరించింది. యాక్టింగ్, డాన్స్ పరంగా దివి చాలాసార్లు తనని తాను ప్రూవ్ చేసుకుంది. కానీ, ఒక గ్లామర్ సాంగ్ లో ఎలా చేస్తుందా అనే అనుమానాలు రావచ్చు. కానీ, ఆ లిరికల్ సాంగ్, మధ్యలో వచ్చిన మాస్ స్టెప్పులు చూసిన తర్వాత ఎవరికీ ఇంక ఆ అనుమానం రాదు. నిజానికి ఇటీవల శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ ఇప్పుడు దానికి మించి ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇంక దివి వాద్త్యా అటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫొటోషూట్లు, రీల్స్ అంటూ అభిమానులకు టచ్ లోనే ఉంటూ ఉంటుంది. ఓవైపు ట్రెడిషినల్, మరోవైపు ఘాటు ఫోజులతో అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు నటిగా, డాన్సర్ గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుఎన్సర్ గా చాలా బిజీగా ఉంటోంది. ఇంక ఈ రుద్రంగి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో జగపతిబాబు, మమతా మోహన్ దాస్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీకి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నాడు.