Divi: బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఫేమ్ సంపాదించుకున్న బ్యూటీలలో దివి ఒకరు. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక పూర్తిగా గ్లామర్ షో చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు చేసుకుంటోంది. అవకాశాలు వస్తే సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తోంది. అయితే.. మొదట్లో ఫోటోషూట్స్ వరకే అందాల షోని పరిమితం చేసిన దివి.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక ఘాటైన ముద్దు సన్నివేశాలు, బెడ్ సీన్స్ లో రెచ్చిపోతుంది.
అందుకు నిదర్శనంగా నయీమ్ సినిమాలో దివి హద్దులు చెరిపేసిన రొమాన్స్ సన్నివేశాలను చూడవచ్చు. ఆ విషయం పక్కన పెడితే.. దివి పాపులర్ వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్ లో రమ్య అనే క్యారెక్టర్ చేసింది. ఆ క్యారెక్టర్ అచ్చంగా దివిని చూసే క్రియేట్ చేశారేమో అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రమ్య అనే క్యారెక్టర్ ఈ వెబ్ సిరీస్ లో ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, అందమైన ఫోటోలు పెడుతూ ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ ఉంటుంది.
తాజాగా తాను చేసిన రమ్య క్యారెక్టర్ కి సంబంధించి డైలాగ్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో రీల్ చేసి పోస్ట్ చేసింది దివి. సోషల్ మీడియా ద్వారా మగాళ్లని ఎలా మాయ చేయొచ్చు.. అందాన్ని పెట్టుబడిగా పెట్టి ఎలా ఫ్యాన్స్ ని తనవెంట తిప్పుకోవచ్చు.. అనే విషయంపై హీరోయిన్ కి హితబోధ చేస్తుంది దివి. అందులో సీమ యాసతో ‘ఒంటి మీద సరుకు ఉన్నప్పుడే మార్కెట్ చేసుకోవాలి’.. అంటూ జీవితసత్యాలు చెప్తుంది దివి.
అదేవిధంగా ‘అలా నిలబడి.. తల దించి కళ్లు పైకి ఎత్తి.. జుట్టు అలా సరి చేసుకుంటూ.. అమ్మో బాపుగారో బొమ్మో అనే పాటకి ఒక్క స్టేటస్ పెడితే చాలు మొగోల్లు ఇంటి ముందు క్యూ కడతారు. కొద్దిగా స్కిన్ షో చేసి.. కొద్దిగా నడుం చూపిస్తే చాలు.. దెబ్బకి పడిపోతారు’ అంటూ చెప్పిన బోల్డ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి దివి చెప్పిన ఈ బోల్డ్ డైలాగ్స్, వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.