సిరి హనుమంత్.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోల్లో నటిస్తూ.. గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత వెబ్ సిరీస్, బుల్లితెర సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తో బిగ్‌బాస్ ఆఫర్ కూడా అందుకుని.. సీజన్ 5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక బిగ్‌బాస్ ద్వారా ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ పాపులారిటీ తనపై ఎంతో నెగెటివిటీ చూపించింది. మరీ ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో సిరి షణ్ముఖ్ జస్వంత్‌తో చనువుగా ఉండటం.. హగ్గులతో రెచ్చిపోవడంతో ఎంతో చెడ్డ పేరు తెచ్చుకుంది. ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఈ విషయంలో మందలించారు. అయినా హౌజ్‌లో ఉన్నన్ని రోజులు వీరు తమ తీరు మార్చుకోలేదు.
ఈ క్రమంలోనే వీరి వ్యవహార శైలి గురించి నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో బిగ్‌హౌస్ నుంచి బయటకు రాగానే షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు దీప్తి సునయన అతడితో బ్రేకప్ చెప్పుకుంది. అలాగే సిరి తన ప్రియుడు శ్రీహాన్‌ల లవ్ బ్రేకప్ అవుతుందని చాలామంది భావించినప్పటికీ వీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంత సంతోషంగా కలిసి ఉన్నారు. బిగ్ బాస్ తర్వాత సిరి తన ప్రియుడు శ్రీహాన్ కలిసి పలు షోలలో సందడి చేస్తుంది.
ఇదిలా ఉండగా తాజాగా సిరి ఖరీదైన కారును కొనుగోలు చేసింది. మోరీస్ గ్యారేజ్ కారును కొనుగోలు చేసింది. ఈ క్రమంలో తన ప్రియుడు శ్రీహాన్‌తో కలిసి కారు కొనుగోలు చేస్తున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు వీరికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ కారు కొనుక్కున్న సందర్భంగా సిరి గురించి శ్రీహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కారు కొనడం కాదు ముందు డ్రైవింగ్ చేయడం నేర్చుకో అంటూ సిరిని ఉద్దేశించి శ్రీహాన్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమానికి శ్రీహాన్ వెళుతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. బిగ్‌బాస్ 5 సమయంలో సిరికి మద్దతుగా నిలవడంతో అతడిని చాలా మంది ప్రశంసించారు. బిగ్ బాస్ 5 సీజన్ సందర్భంగా శ్రీహాన్ తన చర్యలతో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నాడు. మరి అతడు బిగ్‌బాస్‌కు వెళ్తాడో.. లేదో తెలియదు కానీ.. ఒకవేళ శ్రీహాన్ కనుక బిగ్‌బాస్‌లోకి వెళ్తే తప్పకుండా విన్నర్ అవుతారని అభిమానులు భావిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.