క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం అమ్మాయిలకు మాత్రమే ఎదురయ్యే సమస్య అనుకున్నాం. కానీ హిందీ బిగ్ బాస్ ఫేమ్ శివ ఠాక్రే విషయంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ తనను బాగా వేధిచిందని తాజాగా వెల్లడించాడు.
దేశంలో ఒకానొకదశలో క్యాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద ఎత్తున దుమారమే జరిగింది. ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాదు దేశం మొత్తం మీద ఈ సమస్య ఇప్పటికీ పట్టి పీడిస్తుంది. అవకాశాలు కోసం హీరోయిన్లను పడకగదిలోకి పిలిపించుకోవడమే క్యాస్టింగ్ కౌచ్. ఈ విషయంలో కొందరు హీరోయిన్లు (కంగనా రనౌత్ , మాధవీ లత, చిన్మయి) ధైర్యంగా తమ జీవితంలో జరిగిన సంఘటనలు మీడియా ముందు చెప్పుకుంటే.. మరికొందరు మాత్రం క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. కానీ మాకు అలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదు అని చెప్పుకొచ్చారు. అయితే క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం అమ్మాయిలకు మాత్రమే ఎదురయ్యే సమస్య అనుకున్నాం. కానీ హిందీ బిగ్ బాస్ ఫేమ్ శివ ఠాక్రే విషయంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ తనను బాగా వేధిచిందని తాజాగా వెల్లడించాడు.
అతడి పేరు శివ ఠాక్రే. హిందీ బిగ్ బాస్ సీజన్ 16 లో ఇతనొక కంటెస్టెంట్. ఈ సీజన్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించి రన్నరప్ గా నిలిచాడు ఠాక్రే. ఇటీవలే మరాఠీ, ఎంటీవీ రోడీస్ రైడింగ్ షోల్లో మెరుస్తున్న ఈ యంగ్ యాక్టర్ కి ప్రస్తుతం సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. శివ ఠాక్రే మాట్లాడుతూ.. “ముంబైకి వచ్చిన కొత్తలో నేనొక విషయం తెలుసుకున్నాను. క్యాస్టింగ్ కౌచ్ కేవలం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంటుందనే దానికి నా జీవితమే ఉదాహరణ. ఆరమ్ నగర్లో నేను ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఓ డైరెక్టర్ నన్ను బాత్ రూమ్ లోకి రమ్మన్నాడు. అక్కడకు వెళ్లి చూసేసరికి ఆ డైరెక్టర్ ఇక్కడ మసాజ్ సెంటర్ ఉంది. ఆడిషన్ అయిపోయాక ఒక సారి మసాజ్ సెంటర్ కి రా.. నీతో పనుంది అని చెప్పాడు. ఆడిషన్ కి వస్తే మసాజ్ ఏంటి? అనే అనుమానం నాకు వచ్చింది. దీంతో అక్కడనుంచి బయటకు వచ్చేసాను”. అని చెప్పాడు.
ఒక మహిళా విషయంలో కూడా తానకు ఇలాంటి సమస్య ఎదురైందని చెప్పుకొచ్చాడు. దీని గురించి చెబుతూ.. “ఓ మహిళా నన్ను అర్ధ రాత్రి నన్ను 11 గంటలకు ఆడిషన్ కి రమ్మని పిలిచింది. తనకు నాలుగు బంగ్లాలు ఉన్నాయంటూ.. పెద్ద పెద్ద వాళ్ళను స్టార్లను చేశానని తన గురించి గొప్పలు చెప్పుకుంది. అయితే 11 గంటల సమయంలో ఆడిషన్ అనేసరికి.. నేను అర్ధం చేసుకోలేనంత అమాయకుడిని కాదు. వేరే పని ఉందని రానని చెప్పేశాను. దీంతో ఆమె నువ్వు రాకపోతే ఇండస్ట్రీలో నువ్వు ఎలా ఉంటావో చూస్తాను అని బెదిరించింది. అయినా సరే ఆమె మాటలు లెక్కచేయకుండా అక్కడనుంచి వెళ్లిపోయాను”. అని ఈ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.