ఉర్ఫీ జావెద్.. బాలీవుడ్, సోషల్ మీడియాలో ఈమె గురించి తెలియని వారుండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రోజూ విచిత్రమైన, బోల్డ్ వస్త్రధారణతో ఉర్ఫీ జావెద్ అభిమానులను అలరిస్తుంటుంది. కొన్నిసార్లు ఆ దుస్తులు చూస్తే ఇలా కూడా వేసుకుంటారా? అనే అనుమానం రాకమానదు. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన ఉర్ఫీ.. బిగ్ బాస్ తో బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత కాంట్రవర్సీలతో బాగా పాపులర్ అయ్యింది.
రోజూ ఏదొక ఫ్యాన్సీ డ్రెస్ తో ఫొటోలు పెట్టే ఈ అమ్మడు నాలుగురోజుల నుంచి ఇన్ స్టాగ్రామ్ లో ఎలాంటి అప్‌డేట్ పెట్టలేదు. ఆమె ఎందుకు బయటకు రావడంలేదా అని ఫ్యాన్స్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆమె ఆస్పత్రిలోత చేరింది. అందుకే అప్‌డేట్స్ రావడంలేదంటూ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలు తన ఇన్ స్టా స్టోరీగా పోస్ట్ చేసింది.
హాస్పిటల్‌లో ఆహారం అంత రుచిగా ఉండదు అంటూ ఆస్పత్రి బెడ్ మీద ఉన్న పిక్ ను పోస్ట్ చేసింది. చాలా రోజులుగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోలేదు కాబట్టే ఇప్పుడు ఇలా ఆస్పత్రిపాలు కావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఉర్ఫీ జావెద్ ఆరోగ్యంపై ఆమె ఫ్యాన్స్ మొదట ఆందోళన చెందగా.. ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలుసుకుని కుదుట పడ్డారు. ఆమె నుంచి రెగ్యులర్ అప్ డేట్స్ ఎప్పుడొస్తాయా అంటూ ఎదురు చూస్తున్నారు.
ఉర్ఫీ జావెద్ కెరీర్ విషయానికి వస్తే.. బడే భయ్యాకీ దుల్హానియా అనే సీరియల్ తో తన కేరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత మేరీ దుర్గా సిరీస్ తో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. హిందీ బిగ్ బాస్ ఓటీటీలో అవకాశం రావడం, తర్వాత ఎలిమినేట్ అవ్వడంతో ఆమెకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. అంతేకాకుండా ఇండస్ట్రీపై అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ కూడా ఉర్ఫీ లైమ్ లైట్‌లో నిలుస్తుంటుంది. ఉర్ఫీ జావెద్ ఆస్పత్రి పాలు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.