ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీలు నటించారు. ఒకటీ రెండు సినిమాలు సక్సెస్ తర్వాత తిరిగి బాలీవుడ్ కి పయణమయ్యారు. బాలీవుడ్ బ్యూటీ నిక్కి తంబోలి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించింది. తెలుగు లో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. తాజాగా ఈ అమ్మడు తనపై వస్తున్న ట్రోలింగ్స్ పై కన్నీరు పెట్టుకుంది.
ఇటీవల పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి చెందిన విషయాన్ని తట్టుకోలేక నిక్కి తంబోలి ఎయిర్ పోర్ట్ లోనే గుక్క పెట్టి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అయితే నిక్కి తంబోలి బాధను కొంత మంది వక్రీకరిస్తూ ఆమె జస్ట్ అలా యాక్టింగ్ మాత్రమే చేస్తుందని.. అదంతా దొంగ ఏడుపు అంటూ ట్రోల్స్ చేశారు. తనపై వస్తున్న ట్రోల్స్ పై నిక్కి తంబోలీ స్పందించి కన్నీరు పెట్టుకుంది. నన్ను చూస్తే కొంత మందికి హేళనగా ఉంది.. నేను నవ్వినా.. ఏడ్చినా ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
తనకు సిద్దూ మూసేవాలా పాటలు, అతని పనితనం ఎంతగానో నచ్చేదని.. తాను `బిగ్ బాస్`షోలో ఉన్నప్పుడు అతడి గురించి మాట్లాడినట్టు తెలిపింది. ఇటీవల సిద్దూ మేసేవాలని ఓ సందర్భంగా కలిసినట్లు తెలిపింది. ఆయన చనిపోయిన విషయం తెలిసి ఒక్కసారే షాక్ తిన్నానని.. ఆ బాధ తట్టుకోలేక ఎయిర్ పోర్ట్ లో ఎడ్చేశానని చెప్పింది. కానీ కొంత మంది నా బాధ అర్థం చేసుకోకుండా తను ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. మంచి స్నేహితున్ని కొల్పోయిన బాధ మాటల్లో చెప్పలేనని, చెప్పినా అలాంటివాళ్లకు అర్థం కాదని తెలిపింది.
ఇలాంటి అవమానాలు గతంలో కూడా పలుమార్లు తాను ఎదుర్కొన్నానని.. తన సోదరుడు చనిపోయిన సమయంలో కూడా కొంతమంది ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో కొంత మంది నన్ను అదేపనిగా తిట్టడం పనిగా పెట్టుకున్నారని.. ఎన్ని విమర్శలు వచ్చినా అవన్నీ ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: ఘనంగా నటి పూర్ణ ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫొటోస్!