తెలుగు బుల్లితెరపై జూనియర్ సమంతగా పిలవబడుతున్న అందాల బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కెరీర్ బిగినింగ్ లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ అందరినీ తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ అందులో పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో తక్కువ వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తన అందాలు చూపిస్తూ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల మనసు దోచింది. అదే సమయంలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మను బోల్డ్ గా ఇంటర్వ్యూ చేయడంతో ఈ అమ్మడికి మరింత పాపులారిటీ పెరిగిపోయింది.
ఆ మద్య ఓటీటీలో వచ్చిన బిగ్ బాస్ సీజన్ లో ఎక్కువ వారాలు ఉండి మిగిలిన కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. మొదటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్న అషూరెడ్డి ఇటీవల వరుసగా తన హాట్ హాట్ ఫోటో షూట్స్ ని ఇన్ స్ట్రాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. రోజు రోజుకీ ఈ అమ్మడు తన గ్లామర్ డోస్ పెంచేస్తూ అందాలు ఆరబోస్తుంది. అషురెడ్డికి కాస్త ఫ్రీ టైమ్ దొరికతే చాలు తన ఫ్రెండ్స్ తో కలిసి టూర్స్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది.
ప్రస్తుతం అషురెడ్డి విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది. అక్కడ ఉన్న అందమైన లోకేషన్స్ చుట్టేస్తూ తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ అమ్మడు లండన్ లో పొట్టి డ్రెస్ తో కెమెరా ముందు హాట్ లుక్ తో ఫోటో షూట్ కి ఫోజులిచ్చింది. ఎలాంటి యాంగిల్ లో అయినా.. తన అందాలకు ఎవరూ సాటిరారు అంటూ ఫోజులిచ్చింది. క్లీవేజ్ షోతో కుర్రాళ్లను గిలిగింతలు పెడుతుంది. అషురెడ్డి తాజాగా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.