బాలీవుల్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత ఇతర భాషల్లో కూడా సత్తా చాటుతూ వచ్చింది. తెలుగు, కన్నడ, తమిళ్, మళియాళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో యన్టీఆర్, నాని తర్వాత ప్రస్తుతం మూడు సీజన్లు కింగ్ నాగార్జున కంటిన్యూ చేస్తున్నారు. ఇక తమిళ్ లో విశ్వనటుడు కమల్ హాసన్ హూస్ట్ గా నిర్వహిస్తున్నారు. తమిళ బిగ్‌బాస్ నటి జూలీ అమింజికరై అలియాస్ మరియా జులియానా పోలీసులను ఆశ్రయించింది. నాలుగేళ్లు ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మాయ మాటలు చెప్పి నగలు, నగదు తీసుకుని తన ప్రియుడు పరారయ్యాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యావు కాలనీలో ఉండే మనీష్ అనే యువకుడితో నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉంది జూలి. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే మనీష్ ఆమెకు మాయమాలు చెప్పి విలువైన బైకు, రిఫ్రిజిరేటర్, నగలు, నగదు తీసుకుని పారిపోయాడు. కొన్ని రోజులుగా అతని జాడ తెలియకపోవడంతో జూలి అన్నానగర్ మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. మనీశ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నటి జూలీ చెన్నైలో మెరీనా బీచ్ వేదికగా జరిగిన జల్లికట్టు ఉద్యమంలో పాల్గొని.. అందరి దృష్టిని ఆకర్షించింది జులియానా. ఈ ఉద్యంలో ఆమె చేసిన నినాదాలకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఇదే క్రేజ్‌తో లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తమిళ బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టింది. ఈ అమ్మడు తన సహ కంటెస్టెంట్స్ తో గొడవ పడుతూ అతి తక్కువ కాలంలోనే ఎలిమినేషన్ అయ్యింది.