బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ మీ అందరికీ గుర్తు ఉందా? తొలి సీజన్ ని నడిపించే హోస్ట్ ఎవరు అని అంతా ఎదురుచూస్తున్న సమయంలో జూనియర్ యన్టీఆర్ రంగంలోకి దిగి.. బిగ్ బాస్ షోకి తెలుగులో మంచి లాంచింగ్ ఇచ్చాడు. తరువాత సీజన్స్ కి జూనియర్ దూరం కావడంతో.. నేచురల్ స్టార్ నాని ఆ బాధ్యతని తీసుకున్నాడు. మూడో సీజన్ కి వచ్చే సరికి నాని కూడా నా వల్ల కాదు అనేశాడు. ఇక ఆ కష్ట సమయంలో అక్కినేని సీనియర్ హీరో నాగార్జున ఆ లోటుని భర్తీ చేయగలిగాడు. అప్పటి నుండి తెలుగునాట బిగ్ బాస్ అంటే నాగార్జున అన్న రీతిలో షో ముందుకి వెళ్ళింది. ఇక త్వరలోనే బిగ్ బాస్-5 మొదలు కాబోతున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది.
బిగ్ బాస్-5 కి హోస్ట్ గా చేయడానికి కింగ్ నాగార్జున నిరాకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్ చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కరోనా కారణంగా ఈ సినిమాల షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పుడు ఆగిపోతాయా తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ కోసం నాలుగు నెలల సమయం కేటాయించడం అసాధ్యంగా భావించిన నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
నాగార్జున హోస్ట్ గా తప్పుకోవడంతో బిగ్ బాస్ నిర్వాహకులు మరో సార్ట్ హీరోని రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ టార్జాన్, దుగ్గుబాటి రానా బిగ్ బాస్-5 కి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. రానాకి బుల్లితెర హోస్టింగ్ కొత్తేమి కాదు. గతంలో ‘నెంబర్ వన్ యారీ’అనే షోకి హోస్ట్‌గా వ్యవహరించాడు. పైగా.., రానా స్పాంటేనియస్ గా మాట్లాడేయగలడు. ఈ కారణంగానే దగ్గుబాటి హీరో బిగ్‌బాస్- 5 కి హోస్ట్ గా చేయడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.