ఒక్క తెలుగులోనే కాదు.. ప్రారంభమైన అన్ని భాషల్లో హిట్ కొట్టిన బిగెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఈ మూడు నెలలు ఎవరిని కదలించినా వినిపించే ముచ్చట్లు బిగ్‌బాస్ గురించే. మరి అంత క్రేజ్ ఉన్న షోకి వెళ్లడం అంత ఈజీ కాదు. సినిమా, టీవీ, వినోద రంగాల్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలను ఈ షోకు ఎంపిక చేస్తారు. షో మొదలైన దగ్గర్నుంచి ఎక్కువగా వినిపించే ప్రశ్న కంటెస్టెంట్లకు ఎంత చెల్లిస్తున్నారు. ఈసారి ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరికి అనే సందేహం వస్తుంటుంది.
బిగ్ బాస్‌లో రెమ్యునరేషన్ ఆ సెలబ్రిటీకి ఉన్న ఫాలోయింగ్, బయట వారి సంపాదన మీద ఆధారపడి ఉంటుంది. దాదాపు మూడు నెలలకు పైగా హౌస్ ఉండాలి. వారికి వారం బేసిస్ మీద రెమ్యునరేషన్ చెల్లించే విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో మాత్రం గణాంకాలు చాలా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. ముందుగా అందరి కంటే ఎక్కువగా అందరికి తెలిందే.. కింగ్ నాగార్జునకు చెల్లిస్తున్నారు. ఈసారి నాగ్ తన రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడని టాక్. గత సీజన్‌కు రూ.8 కోట్లు తోసుకోగా.. ఈసారి దానిని 50 శాతం పెంచేసి రూ.12 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
హౌస్ మేట్స్‌లో అందరికంటే ఎక్కువగా యాంకర్ రవికి చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. బయట షోలతో ఫుల్ బిజీగా ఉన్న రవి వారానికి రూ.2 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక, తర్వాతి స్థానంలో ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ ఉన్నాడు. షణ్ణుకి వారానికి రూ.1.8 లక్షలు చెల్లిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ డాన్స్ మాస్టర్ యానీ మాస్టర్‌కు కూడా రూ.1.8 లక్షలే చెల్లిస్తున్నారని తెలుస్తోంది. వీరి తర్వాత సింగర్ శ్రీరామ చంద్ర రూ.1.6 లక్షలు, వీడియో జాకీ సన్నీకి రూ.1.2 లక్షలు, నటరాజ్ మాస్టర్, నటి ప్రియ, లహరి, సిరి హనుమంతుకు వారానికి రూ.లక్ష చెల్లిస్తిన్నట్లు చెబుతున్నారు. విశ్వ-రూ.90 వేలు, హమీదాకి రూ.80 వేలు, శ్వేత వర్మ, లోబో, నటి ఉమాదేవికి రూ.80 వేలు చెల్లిస్తున్నట్లు సమాచారం. సీరియల్ యాక్టర్ మానస్‌కు రూ.70 వేలు, మోడల్ జెస్సీ, ఆర్జే కాజర్, జబర్దస్త్ ప్రియాంక సింగ్‌కు వారానికి రూ.50 వేలు చెల్లిస్తున్నారని తెలుస్తోంది.
ఈ వారం హౌస్‌లో నుంచి ఎలిమినేట్ అవ్వడానికి నామినేషన్స్‌లో ఉన్న సభ్యులు జెస్సీ, మానస్, సరయు, ఆర్జే కాజల్, యాంకర్ రవి, హమీదా అన్న విషయం తెలిసిందే.