తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో ఫస్ట్ కంటెస్టెంట్ గా.. సిరి హనుమంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు ఈ సిరి హనుమంత్ ఎవరంటూ ఈమె వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి.., ఇప్పుడు మనం సిరి హనుమంత్ బయోడేటా పై ఓ లుక్ వేద్దాం.
సిరి హనుమంత్ మన అచ్చమైన తెలుగు అమ్మాయి. ఈమె 1996 జనవరి 2న విశాఖపట్నంలో జన్మిచ్చింది. ఇంటర్మీడియట్ కి వచ్చే వరకు సిరి నటనపై గాని, యాంకరింగ్ పై గాని అంతగా ద్రుష్టి పెట్టలేదు. ఎంసెట్ లాంగ్ టర్మ్ తీసుకోవడంతో.. సిరికి కాస్త ఖాళీ సమయం దొరికింది. అప్పుడు స్నేహితుల సూచన మేరకు యాంకరింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ముందుగా వైజాగ్ లోని రెండు లోకల్ ఛానల్స్ లో యాంకర్ గా పని చేసింది.
సిరి హనుమంత్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుండటంతో.. హైదరాబాద్ లోని 99టీవీ ఛానెల్ నుండి ఆమెకి పిలుపు వచ్చింది. అలా.., శాటిలైట్ ఛానెల్ లోకి ప్రవేశించింది. అక్కడ కొన్ని రోజులు పని చేశాక.., టీ న్యూస్ న్యూస్ రీడర్ గా జాయిన్ అయ్యింది. ఇందులో రెండేళ్లు పాటు పనిచేశాక సిరికి టీవీ సీరియల్ ఆఫర్ వచ్చింది.
స్టార్ మాలోనే ప్రసారమైన “ఉయ్యాలా జంపాలా” సీరియల్ తో సిరి హనుమంత్ బుల్లితెర ప్రయాణం మొదలైంది. ఈమె ఇక్కడ కూడా సూపర్బ్ గా క్లిక్ అవ్వడంతో.. “అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి” వంటి పెద్ద సీరియల్స్ లో మంచి రోల్స్ లభించాయి. ఇదే ఊపులో “ఇద్దరి లోకం ఒక్కటే, ఒరేయ్ బుజ్జిగా” వంటి సినిమాల్లోనూ మెరిసింది ఈ తెలుగమ్మాయి.
నిజానికి ఈ అమ్మడు మల్టీ టాలెంటెడ్. సోషల్ మీడియాలో కూడా సిరి చాలా యాక్టీవ్ గా ఉంటుంది. పలు వెబ్ సిరీస్, షార్ట్ వీడియోస్ లో కూడా నటించిన సిరి.. సొంతగా ఓ యూట్యూబ్ ఛానెల్ ని కూడా రన్ చేస్తుండటం విశేషం. మరి.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సిరి హనుమంత్ బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలదు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. )