తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో 8వ కంటెస్టెంట్‌గా మోడల్ జెస్సీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో.. ఇప్పుడు ఈ జెస్సీ ఎవరంటూ.. ఇతని వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి.., ఇప్పుడు మనం మోడల్ జెస్సీ బయోడేటా పై ఓ లుక్ వేద్దాం.
జెస్సీ పూర్తి పేరు జశ్వంత్ పడాల. ఇతను పలు కార్పొరేట్ యాడ్స్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. మోడలింగ్ రంగంలో పలు అవార్డులు ఇతని సొంతం. ఇక “ఎంత మంచివాడవురా” ఇతని మొదటి సినిమా. కెరీర్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న జెస్సీ బిగ్ బాస్ రూపంలో మంచి ప్లాట్ ఫామ్ దక్కిందనే చెప్పుకోవాలి. మరి.. లక్ కొద్దీ బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో ఎనిమిదో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన జెస్సీ.. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలడు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. త్వరలోనే మరింత సమాచారం అందిస్తాము)