తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో ఆరవ కంటెస్టెంట్ గా.. లోబో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో.. ఇప్పుడు లోబో గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
లోబో అసలు పేరు మహమ్మద్ ఖయ్యూం.పెరిగిన వాతావరణ పరిస్థితులు కారణంగా ఇతనికి పెద్దగా చదువు అబ్బలేదు. ఇక తొమ్మిదో తరగతిలోనే స్కూలులో దొంగతనం చేసి దొరికిపోవడంతో లోబోకి టీసీ ఇచ్చేశారు. అలా చదువు ఆగిపోవడంతో టాటూ షాపులో పని చేయడం మొదలు పెట్టాడు. ఆ క్రమంలోనే టాటూలపై ఇష్టం పెరిగిపోయింది.
ఇక లోబో తన మొదటి టాటూని ఓ రష్యన్ యువతికి వేశాడు. ఆ అమ్మాయే మన మహమ్మద్ ఖయ్యూంకి లోబో అని పేరు పెట్టింది. ఒక్క పేరు మాత్రమే కాదు.., ఇతనిలో కట్టుబొట్టు, మాట తీరు అన్నీ విభిన్నం. ఈ వైవిధ్యమే లోబోని సెలబ్రెటీని చేసింది. ఇదే క్రమంలో పక్కా హైదరాబాదీ యాస మాట్లాడుతూ యాంకర్ కూడా అయ్యాడు. కొన్ని షోలకి గెస్ట్ గా కూడా వచ్చి.., తనకంటూ సపరేట్ ఐడెంటిటీని సాధించుకోగలిగాడు. అయితే.., దుడుకుతనం, తొందరగా మాట జారడం ఇతని వీక్ నెస్. దీని కారణంగా గతంలో ఓసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. చనిపోయిన తన తండ్రి అంటే లోబోకి ప్రాణం. మరి.., కోపం, ప్రేమ, మంచితనం, దూకుడు అన్నీ ఎమోషన్స్ కలగలిపిన లోబో.. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలడు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.