సాధారణంగా ప్రేమలో పడ్డాక సెలబ్రిటీలు కూడా కొన్నిసార్లు చుట్టూ ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే.. అంతలా ప్రేమలో మునిగితేలుతుంటారు. అయితే.. ప్రేమ అనేది యూనివర్సల్ ఎమోషన్ కాబట్టి ఎవరికైనా ఒకటే. కానీ.. ప్రేమలో ఉన్నాం కదా.. అని ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ లోకి దిగితే మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పవనే చెప్పాలి. నార్మల్ ఆడియెన్స్ ప్రేమలో పడితేనే వారు ముద్దాడుకోవడానికి చాటుగా ఉండే ప్లేస్ చూసుకుంటారు.
ఈ క్రమంలో ఓ బాలీవుడ్ జంట జంట మాత్రం రెండోసారి పబ్లిక్ గా ముద్దాడుకోని వార్తల్లో నిలిచింది. ఇదివరకే ఓసారి పబ్లిక్ లో ఆ సెలబ్రిటీ జంట కిస్ చేసుకొని వైరల్ అయ్యారు. ఇప్పుడు మరోసారి కిస్ చేసుకోవడమే కాకుండా.. మా అమ్మ చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అంటూ వాపోవడం గమనార్హం. ఇంతకీ ఆ సెలబ్రిటీ జంట ఎవరంటే.. ‘బిగ్ బాస్ 15’ ఫేమ్ తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రా. గతేడాది బిగ్ బాస్ షోలో పాల్గొన్న వీరిద్దరికి అక్కడే ప్రేమ పుట్టడంతో.. బయటికి వచ్చాక చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వారిద్దరూ ప్రేమికులు కదా.. ఏమైనా చేసుకుంటారని కూడా అనిపించవచ్చు. కానీ.. పబ్లిక్ లో చేయకూడదు అనేదే వాదన. తాజాగా తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రా షాపింగ్ మాల్ లో ఎలివేటర్ పై వెళ్తూ పబ్లిక్ గా కిస్ చేసుకున్నారు. వారు ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. ఆ వీడియోపై కరణ్ స్పందించాడు. ఆ వీడియో గురించి మాట్లాడేందుకు తేజస్వి నిరాకరించగా.. ‘మా అమ్మ చూస్తే ఏమంటుందో’ అంటూ కరణ్ స్పందించాడు.
చేసిందంతా చేసి ఇప్పుడు అమ్మ చూస్తే ఏమంటుందోనని చెప్పుకురావడం ఈ జంటపై ట్రోల్స్ కి దారితీసింది. మామూలు జనాలే ప్రేమలో పడితే నలుగురిలో నవ్వులపాలు కాకూడదని జాగ్రత్త పడుతుంటారు. సెలబ్రిటీలు అయ్యుండి ఇలా చేయడం ఏంటంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరిని ఫ్యాన్స్ అంతా ‘తేజ్ రణ్’ అని పిలుస్తుంటారు. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తేజస్వి, కరణ్ ల వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.