ఇటీవల సోషల్ మీడియా, మీడియా ఎక్కడ చూసినా కూడా మంచు వారి ఇంట్లో వివాదం అంటూ వార్తలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు మంచు విష్ణ- మనోజ్ గొడవ విషయంలో పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవలు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. మంచు విష్ణు.. సారధి ఇంటికెళ్లి దాడి చేశారని, బంధువుల ఇళ్లకి వెళ్లి ఇలా కొడుతుంటారంటూ మంచు మనోజ్ స్వయంగా కామెంట్ చేసిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియో మనోజ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత మోహన్ బాబు ఎంట్రీతో వీడియో డిలీట్ చేశాడు. అన్నదమ్ముల మధ్య ఇలాంటివి సహజమే అంటూ మోహన్ బాబు సైతం కామెంట్ చేయడం చూశాం. ఆ గొడవ సమసిపోయిందని కూడా తర్వాత చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ గొడవ విషయంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.
మంచు వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయంటూ ప్రచారం జరిగింది. విష్ణు- మనోజ్ గొడవ పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే.. మోహన్ బాబు కూడా ఈ వివాదంపై స్పందించారు. క్షణికావేశంలో జరిగేవి ఇవి అంటూ కామెంట్ చేశారు. ఇంకొందరైతే ఇంకో అడుగు ముందుకేసి.. మోహన్ బాబు ఇద్దరు కొడుకులకు ఆస్తులను పంచేశారు.. వారి మధ్య వివాదం సమసి పోయింది అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ వివాదంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. అది అసలు నిజమైన గొడవ కానేకాదట. అదంతా ప్రాంక్ వీడియో అంటూ స్వయంగా మంచు విష్ణునే ప్రకటించాడు.
అవును.. విష్ణు- మనోజ్ గొడవ నిజం కాదట. అదొక రియాలిటీ షో కోసం చేసిన వీడియో అని అధికారికంగా ప్రకటించారు. మంచు ఫ్యామిలీ త్వరలోనే ఒక రియాలిటీ షోని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందట. దానికి ‘హౌస్ ఆఫ్ మంచూస్’ అని పేరు కూడా పెట్టారు. ఈ షోకి సంబంధించిన ఒక టీజర్ ని మంచు విష్ణు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ కొటేషన్ కూడా పెట్టారు. త్వరలోనే ఒక ప్రముఖ ఓటీటీ వేదికగా ఈ రియాలిటీ షో స్ట్రీమ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ ఒకింత షాకయ్యారు. ఎందుకంటే అందరూ అది నిజమైన గొడవే అనుకున్నారు. కానీ, ఇలా ప్రాంక్ అనేసరికి ఆశ్చర్యానికి గురయ్యారు. గట్టిగానే ప్లాన్ చేశారు అయితే అంటూ కామెంట్ చేస్తున్నారు.