కోలీవుడ్ హీరోయిన్ మీరా మిథున్ మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఏది అనిపిస్తే అది మాట్లాడి వివాదాలను కొనితెచ్చుకొనే ఈ భామపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. దళిత, షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకులు, నటీనటుల వల్ల తనకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి అని చెబుతూ దళితులను తమిళ ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని తమిళ హీరోయిన్ మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సహా మరో ఏడు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి.
గతంలో ఈ కేసు విషయంలో ఆమెను అరెస్ట్ చేశారు. మోడల్ మీరా మిథున్ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, ఆమెకు గుర్తింపు తెచ్చింది మాత్రం విజయ్ టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో. ఈ షోలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు తెగ హల్ చల్ చేసింది. మీరా మిథున్ ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెను కేరళలో అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు.
అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కొన్ని విచారణలకు హాజరైన ఆమె.. మళ్లీ విచారణలకు గైర్హాజరైంది. మీరాను అరెస్టు చేసి ఏప్రిల్ 4న హాజరుపరచాలని ఫెడరల్ క్రిమినల్ పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఎగ్మూరులోని కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.