బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి ఎంతగొనే ఇష్టమైన రియాలిటీ షో. తెలుగునాట ఇప్పటి వరకు జరిగిన 4 సీజన్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు 5వ సీజన్ కి రంగం సిద్ధమవుతోంది. నిజానికి బిగ్ బాస్-5 ఈ పాటికే ప్రారంభం అయ్యి ఉండాల్సింది.
కానీ.., కరోనా కారణంగా షో షెడ్యూల్ అంతా తారుమారైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ అదుపులోకి వచ్చింది. దీంతో.., సీజన్ 5 నిర్వహించడానికి ఇంత కన్నా మంచి సమయం రాదని నిర్వాహకులు భావిస్తున్నారు. దీంతో.., త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 5 మొదలు కాబోతుందన్న టాక్ వినిపిస్తోంది.
బిగ్ బాస్-5 లో కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారన్న విషయంలో చాలా కాలంగా చర్చ నడుస్తోంది. అయితే.., అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి షోలో పాల్గొనబోయే వారిని ఇప్పటికే ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. చాలా రోజుల గ్యాప్ తరువాత షో మొదలు కాబోతుండటంతో ఈసారి లేడీ కంటెస్టెంట్స్ కి ఎక్కువ అవకాశం ఇవ్వాలని బిగ్ బాస్ యాజమాన్యం నిర్ణయించుకుందట.
ఇందులో భాగంగానే డీ’ యాంకర్ వర్షిణి, సింగర్ మంగ్లీ, జబర్డస్త్ వర్ష, టిక్ టాక్ స్టార్ భాను, న్యూస్ యాంకర్ ప్రత్యూష, సీనియర్ హాట్ యాక్ట్రెస్ ప్రియ, మరో సీనియర్ అందెగత్తె సురేఖ వాణి, వరంగల్ వందన, సీనియర్ నటి యమున ఇలా 16మందిలో 9మంది లేడీస్ నే సెలెక్ట్ చేశారట బిగ్ బాస్ టీమ్.
ఇక మేన్స్ కోటాలో షణ్ముఖ్, యాంకర్ శివ, సీనియర్ ఆర్టిస్ట్ రాఘవ, రంగస్థలం మహేశ్, చమ్మక్ చంద్ర, రియాజ్, టిక్ టాక్ దుర్గారావు, ఓ మాజీ స్టార్ హీరో హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. ఇప్పటి వరకు నాలుగు సీజన్స్ లో విజేతగా నిలిచింది మగవారే. ఈ కారణంగానే ఈసారి లేడీస్ సంఖ్య డబుల్ చేసినట్టు తెలుస్తోంది. మరి.. వీరిలో ఈసారి టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాలి.