'బిచ్చగాడు 2' కలెక్షన్స్ చూసి హ్యాపీ అయిపోతున్న విజయ్ ఆంటోని.. మూడో పార్ట్ పై క్లారిటీ ఇచ్చేశాడు. పలు డీటైల్స్ కూడా రివీల్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
టాలీవుడ్ ప్రేక్షకులు చాలా డిఫరెంట్. ఒక్కసారి సినిమా నచ్చితే చాలు.. అది తెలుగు, తమిళ, కన్నడ ఇలా ఏ భాష అనేది అస్సలు పట్టించుకోరు. చెప్పాలంటే గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా తెలుగులో జస్ట్ ఒకే ఒక్క మూవీతో ఫేమస్ అయిన వ్యక్తి విజయ్ ఆంటోని. తొలుత మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘మహాత్మ’ లాంటి చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అంటే 2016లో ‘బిచ్చగాడు’తో హీరోగా పలకరించాడు. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తాజాగా ఆ మూవీ సీక్వెల్ రిలీజైంది. ఇప్పుడు ఏకంగా మూడో భాగంపై విజయ్ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. స్వతహాగా సంగీత దర్శకుడు అయిన విజయ్ ఆంటోని, అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ లో నటించాడు. ‘సలీమ్’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించినప్పటికీ హిట్ కొట్టలేకపోయాడు. ‘బిచ్చగాడు’గా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. తమిళంలో కలెక్షన్స్ సంగతి అటుంచితే తెలుగులో మాత్రం ప్రేక్షకుల ఆదరణతోపాటు అద్భుతమైన వసూళ్లని సొంతం చేసుకుంది. దీని తర్వాత దాదాపు ఎనిమిదేళ్లపాటు హీరోగా విజయ్ ఆంటోని చాలా సినిమాలు చేశాడు గానీ పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ అయితే లేవు. మళ్లీ ఇన్నాళ్లకు ‘బిచ్చగాడు 2’తో సక్సెస్ అందుకున్నాడు.
తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి తెలుగులో తొలిరోజే రూ.4 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. దీంతో విజయ్ ఆంటోని చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు ఇదే ఊపులో ‘బిచ్చగాడు 3’ కూడా అనౌన్స్ చేశాడు. 2025 నుంచి సెట్స్ పైకి వెళ్తుందని, దీనికి తానే దర్శకత్వం వహిస్తానని అఫీషియల్ గా చెప్పుకొచ్చాడు. తొలి పార్ట్ మదర్ సెంటిమెంట్, రెండో పార్ట్ సిస్టర్ సెంటిమెంట్.. మరి మూడో భాగంలో ఎవరి సెంటిమెంట్ తో వస్తాడోనని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. మరి ‘బిచ్చగాడు 2’ మీలో ఎవరైనా చూశారా? చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.