టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన 'బిచ్చగాడు' మూవీకి సీక్వెల్ రెడీ అయిపోయింది. త్వరలో థియేటర్లలోకి రానుంది. తాజాగా దీని ట్రైలర్ ని రిలీజ్ చేయగా, ఇప్పుడది వైరల్ గా మారిపోయింది.
ఏ మాత్రం అంచనాల్లేకుండా రిలీజై తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన డబ్బింగ్ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో ‘బిచ్చగాడు’ ఒకటి. స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్ అయిన విజయ్ ఆంటోని.. ఈ చిత్రంతో నటుడిగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ అవేవి పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ‘బిచ్చగాడు 2’తో త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైపోయాడు. తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేయగా.. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. భారీతనంలో రిలీజ్ కు ముందే అంచనాల్ని పెంచేస్తోంది. ఇంతకీ ట్రైలర్ లో అంతగా ఏముంది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘బిచ్చగాడు’లో తల్లి ఆరోగ్యం కుదుటపడటం కోసం ధనికుడైన ఓ వ్యక్తి బిచ్చగాడిలా ఉండటం చూపించారు. మే 19న రాబోతున్న సీక్వెల్ లో కొత్త స్టోరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ గురుమూర్తి, భారత దేశంలో 7వ రిచ్చెస్ట్ మ్యాన్, లక్ష కోట్లకు వారసుడు అనే అదిరిపోయే రేంజులో చూపించారు. ఆ తర్వాత చాలా విజువల్స్ చూపిస్తూ వెళ్లారు. ఇదంతా చూస్తుంటే.. ఈసారి బిచ్చగాళ్లుగా ఉన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి, కొందరు బడా మనుషులు ఎలాంటి పనులు చేస్తున్నారనేది ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ట్రైలర్ చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.