కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు-2’ సినిమా ఈ రోజు (మే 19) థియేటర్లలో భారీ ఎత్తున రిలీజైంది. ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే మార్నింగ్ షో నుంచే మూవీకి పాజిటివ్ టాక్ వచ్చేసింది.
తెలుగు సినీ ప్రేక్షకులను అసలైన మూవీ లవర్స్‌గా చెబుతుంటారు. సొంత భాషా సినిమాలనే గాక ఇతర భాషా చిత్రాలను కూడా టాలీవుడ్ ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. మూవీ బాగుందంటే చాలు.. అది ఏ భాషకు చెందిందనేది అస్సలు పట్టించుకోరు. అందుకే తమిళం సహా కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీషు చిత్రాలు తెలుగులోకి భారీ ఎత్తున డబ్ అవుతుంటాయి. టాలీవుడ్ డబ్బింగ్ మార్కెట్‌కు ఊపు వచ్చింది మాత్రం తమిళ చిత్రాలతోనే. కోలీవుడ్‌లో రూపొందే చాలా మూవీస్ తెలుగు నాట కూడా ఏకకాలంలో విడుదలవుతుంటాయి. అలా రిలీజైన వాటిల్లో కొన్ని బ్లాక్‌బస్టర్ కూడా అయ్యాయి. ఆ కోవలో వచ్చిన ఫిల్మ్ ‘బిచ్చగాడు’. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
‘బిచ్చగాడు’ పాత్రలో విజయ్ ఆంటోని అద్భుతమైన నటనకు తోడుగా తల్లి సెంటిమెంట్ కూడా బాగా వర్కవుట్ అవడంతో ఈ మూవీ బంపర్ విక్టరీ కొట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించినప్పటికీ నుంచి ఎప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతుందా అని ఆడియెన్స్ ఆతృతగా ఎదురు చూస్తూ వచ్చారు. తెలుగులోనూ ఈ ఫిల్మ్ మీద మంచి బజ్ నెలకొంది. ఈ శుక్రవారం ‘బిచ్చగాడు-2’ రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. విజయ్ ఆంటోని ఖాతాలో మరో హిట్ పడినట్లేనని ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకులూ అంటున్నారు. థియేటర్లలో ఆడియెన్స్‌ను అలరిస్తున్న ‘బిచ్చగాడు-2’ మూవీ ఓటీటీ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుందట. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను హాట్‌స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. జూన్ నెల మూడో వారంలో ‘బిచ్చగాడు-2’ ఓటీటీలో విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.