ఈ పాప తెలుగు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమి, హిందీ సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా ఓ సీక్వెల్ తో వచ్చి సూపర్ హిట్ కొట్టింది. ఎవరో కనిపెట్టారా?
మన ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలా ఐదేళ్ల క్రితం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు అంటూ చేస్తూ వస్తోంది. కానీ ఏం లాభం. హిట్ అయితే కొట్టలేకపోతుంది. ప్రస్తుతం తెలుగులో రవితేజ, సందీప్ కిషన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇదంతా పక్కనబెడితే ఓ సీక్వెల్ సినిమాతో తాజాగా సూపర్ హిట్ కొట్టేసింది. తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. మరి ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నాసరే హిట్స్ చాలా అరుదుగా దక్కుతుంటాయి. ఈ బ్యూటీకి కూడా సేమ్ అలానే జరిగింది. ముంబయికి చెందిన ఈ ముద్దుగుమ్మ 2013లో ఓ షార్ట్ ఫిల్మ్ తో ఇండస్ట్రీలోకి వచ్చింది. బట్ హీరోయిన్ గా మాత్రం తెలుగులోనే అరంగేట్రం చేసింది. ‘ఈ మాయ పేరేమిటో’తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈమె పేరు కావ్య థాపర్. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ‘ఏక్ మినీ కథ’లోనూ ఈమెనే హీరోయిన్ గా చేసింది. బట్ సక్సెస్ అయితే అందుకోలేకపోయింది.
గ్లామర్ విషయంలో ఏ మాత్రం అడ్డుచెప్పని ఈ హీరోయిన్.. రీసెంట్ గా ‘బిచ్చగాడు 2’తో ప్రేక్షకుల్ని పలకరించింది. సీక్వెల్ తో వచ్చి మరీ సూపర్ హిట్ కొట్టేసింది. తెలుగులో సందీప్ కిషన్ తో ‘ఊరిపేరు భైరవకోన’, రవితేజతో మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ రెండింటిలో ఏది హిట్ అయినాసరే కావ్యకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సుంది. సో అదనమాట విషయం. గ్లామర్ ఒలకబోసినాసరే చాన్నాళ్లకు హిట్ కొట్టింది. మరి ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది కనిపెట్టారో కింద కామెంట్ చేయండి.