బిచ్చగాడు చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో షేక్ చేసింది. తమిళ హీరో విజయ్ ఆంటోనికి తెలుగులో సాలిడ్ మార్కెట్‌ను క్రియేట్ చేసింది. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బిచ్చగాడు-2 మే19 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి.. తొలి రోజు ఎంత కలెక్షన్లు వసూలు చేసిదంటే..
తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు చిత్రం అందరికి గుర్తుండే ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాతో విజయ్ ఆంటోనికి తెలుగులో సాలిడ్ మార్కెట్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమానులు తెలుగులో విడుదల చేసిన నిర్మాత చదలవాడ శ్రీనివాస్ కు భారీ లాభాలు వచ్చాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు 2 కూడా నిర్మించారు. ఈ సినిమా మే 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
విజయ్ ఆంటోని హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బిచ్చగాడు-2. ఈ సినిమాలో కావ్వ థాపర్ హీరోయిన్ గా నటించింది. అలానే రాధా రవి, వై.జి. మహేంద్రన్, యోగి బాబు వంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం కూడా విజయ్ ఆంటోనినే సమకూర్చాడు. భారీ అంచాల మధ్య మే 19న ఈ సినిమా వర్డల్ వైడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టారు. ఇక బిచ్చగాడు 2 చిత్రాన్ని చాలా గొప్ప, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా తెరకెక్కించారు. ఈ సినిమా 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.
ఇప్పటి వరకు విజయ్ ఆంటోని నిర్మించిన సినిమాల్లో అత్యధిక బడ్జెట్ ఈ మూవీదే అనే విషయాన్ని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక బిచ్చగాడు-2 సినిమా తొలి రోజు భారీగానే కలెక్షన్లు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.10 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక తమిళం భాషల్లో పెద్దగా ఈ సినిమాకు స్పందన కనిపించడం లేదని ఆక్యుపెన్సీతో స్పష్టమంది. తమిళనాడులో తొలి రోజు 3.05 కోట్ల మేర వసూళ్ల సాధించింది. అలానే కర్ణాటకతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కలిపి అరకొటిని వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో కూడా అదే స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా బిచ్చాగాడు-2 మూవీ తొలి రోజు 8.15 కోట్లు వసూలు చేసింది.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తమిళ సినిమాగా ఉన్న బిచ్చగాడు-2 టాలీవుడ్ లో అధిక వసూలు సాధించింది. తమిళనాడు కంటే అధిక స్థాయిలో వసూలు రాబట్టింది. పాజిటీవ్ టాక్ ఉండటంతో మరిన్ని వసూళ్లు సాధించే అవకాశం ఉన్నట్లు ట్రెడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 17 కోట్ల షేర్, 32 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. ఈ చిత్రం రానున్న రోజుల్లో మౌత్ టాక్ పెరిగి.. వసూళ్లను భారీగా సాధించగలిగితే.. ఈ చిత్రం తొలివారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరి.. బిచ్చగాడు-2 మూవీ తొలి రోజు కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.