పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హంక్ రానా కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ చిత్రం ‘భీమ్లా నాయక్‘. ఫిబ్రవరి 25న విడుదల కాబోతున్న ఈ సినిమా పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. రిలీజ్ డేట్ వచ్చినప్పటి నుండే ఫ్యాన్స్ రచ్చ షురూ అయిపోయింది. ఎన్నో భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదలైంది.
డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాను సాగర్ కే చంద్ర తెరకెక్కించగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాలో పవన్ జంటగా నిత్య మీనన్, రానా జంటగా సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇక భీమ్లా నాయక్ గ్లింప్స్ ఇప్పటికే భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ రాకముందే భీమ్లా నాయక్ బిజినెస్ భారీ రేంజ్‌లో జరిగిందని సమాచారం.ట్రైలర్ రివ్యూ:
ఎంతో ఆసక్తిగా అటు ఇండస్ట్రీ.. ఇటుపవర్ స్టార్ ఫ్యాన్స్, దగ్గుబాటి ఫ్యాన్స్ వెయిట్ చేసిన క్షణం రానే వచ్చింది. భీమ్లా నాయక్ మూవీ మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీకి అధికారిక రీమేక్ అయినప్పటికీ, ఇందులో తెలుగు నేటివిటీకి అనుగుణంగా భారీ మార్పులే చేశారు. 2 నిమిషాల 37 సెకెన్ల నిడివి కలిగిన భీమ్లా నాయక్ ట్రైలర్.. పవన్ ఫ్యాన్స్ కి వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. ఓవైపు పవన్ విశ్వరూపాన్ని చూపిస్తూనే, మరోవైపు రానా పాత్రను హైలైట్ చేశారు మేకర్స్.
ముఖ్యంగా మాస్ లుక్కులో పవన్, రానాల లుక్స్.. మాస్ డైలాగ్స్ ఓ రేంజిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ని ఎలివేట్ చేసిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా థియేటర్లలో మాస్ జాతర ఖాయం అనిపిస్తుంది. ట్రైలర్ లో పవన్ డైలాగ్స్.. ‘తోలు తీస్తా నా కొడకా’, ‘చుట్టూ అడవి.. పాయింట్ బ్లాక్ లో కాల్చి తుప్పల్లో పాడదొబ్బితే.. వాడి శవం దొరకడానికి 10 రోజులు పడుతుంది’, ‘నేను ఇవతల ఉంటూనే చట్టం.. అవతలికొస్తే కష్టం వాడికి..’ అలాగే రానా మాస్ డైలాగ్స్ చూసినట్లయితే ‘నాయక్.. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..’, ‘నీ గన్ లో బుల్లెట్ లేకపోతే కేసు.. నా బాడీలో బుల్లెట్ ఉంటేనే కేసు’, ‘ఎవర్ని అరెస్ట్ చేశావో తెలుస్తుందా నీకు..’ హైలైట్ గా నిలిచాయి.
అదీగాక.. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ట్రైలర్ ని మరోస్థాయికి తీసుకెళ్లింది. నిత్యామీనన్ కి మంచి క్యారెక్టర్ పడిందని చెప్పవచ్చు. ట్రైలర్ చివరిలో పవన్ – రానా డైలాగ్స్, మార్కెట్ లో ఫైట్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ట్రైలర్ పై ఫ్యాన్స్ అంచనాలే పెట్టుకున్నారు. వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే.. మాస్ ఫీస్ట్ అదిరిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ట్రైలర్ 10 మిలియన్స్ వ్యూస్ వైపు ఊపందుకుంది. ఇక్కడ తమన్ బిజీఎమ్ పై ఫ్యాన్స్ నిరాశ చెందినట్లు తెలుస్తుంది. అందుకు తమన్ కూడా స్పందించి.. ‘అన్ని ట్రైలర్ లో ఎక్సపెక్ట్ చేస్తే ఎలా.. థియేటర్లో అసలైన ర్యాంప్’ అంటూ ఫ్యాన్స్ ని కూల్ చేశాడు. ట్రైలర్ ఎండింగ్ మాత్రం షాకింగ్ గా డిజైన్ చేశారు.
చివరిమాట: ‘అహంకారానికి, ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్ధమే ఈ భీమ్లా నాయక్’