కొత్త సంవత్సరం రానే వచ్చింది. సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల రిలీజ్ డేట్లు కూడా దగ్గర పడటంతో సినిమాలపై అంచనాలు మరోస్థాయికి చేరుకున్నాయి. అలా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా RRR. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్.. జనవరి 7న రిలీజ్ అవుతుందని అంతా ఎక్సపెక్ట్ చేశారు.
కానీ నార్త్ రాష్ట్రాలలో థియేటర్లు మూతపడటం, ఇంకా సౌత్ లో 50% ఆక్యుపెన్సీలతో పాటు ప్రీమియర్ షోలను రద్దు చేయడంతో RRR మేకర్స్ సినిమాని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి RRR సినిమా కోసం కొన్ని తెలుగు సినిమాలు తమ రిలీజ్ డేట్లను జనవరి నుండి వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు తీరా RRR వాయిదా అనేసరికి అనవసరంగా మా సినిమాలను వాయిదా వేశామని వేరే మేకర్స్ భావిస్తున్నారు.ఇదిలా ఉండగా.. RRR వాయిదా పడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ మూవీకి మళ్లీ దారి దొరికిందని టాక్. భీమ్లానాయక్ రీమేక్ మూవీ.. అదీగాక కేవలం తెలుగు వరకే పరిమితం కాబట్టి సినిమా సంక్రాంతికే పక్కా అనే కథనాలు సినీవర్గాలలో బలంగా వినిపిస్తున్నాయి. పవన్ సినిమాలకు ఏపీలో సమస్యలు ఎదురవుతుంటాయనే సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా భీమ్లానాయక్ సినిమాని సంక్రాంతి బరిలో దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరి భీమ్లానాయక్ సినిమా సంక్రాంతి రాకపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.